
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెంలో నిర్వహిస్తున్న కోలిండియా స్థాయి అథ్లెటిక్స్ క్రీడా పోటీల్లో సింగరేణి కార్మికులు ఆరు మెడల్స్ సాధించారు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో జరుగుతున్న అథ్లెటిక్స్ క్రీడా పోటీల్లో సింగరేణితో పాటు దేశంలోని బీసీసీఎల్, సీసీఎల్, సీఎంపీడీఐ, ఎన్సీఎల్, ఎస్ఈసీఎల్, ఎంసీఎల్, డబ్ల్యూ సీఎల్ కంపెనీలకు చెందిన బొగ్గు గని కార్మిక క్రీడాకారులు పాల్గొన్నారు.
శని, ఆదివారాల్లో పోటీలు జరుగనున్నాయి. మొదటి రోజు జరిగిన పోటీల్లో సింగరేణికి చెందిన క్రీడాకారులు మూడు గోల్డ్, రెండు సిల్వర్, బ్రాంజ్మెడల్ కలిపి మొత్తం పది మెడల్స్ సాధించారు. పోటీల్లో విజేతలకు జీఎం పర్సనల్ కవితా నాయుడుతో పాటు గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల ప్రతినిధులు మిర్యాల రంగయ్య, త్యాగరాజన్, పలువురు సింగరేణి ఆఫీసర్లు మెడల్స్ అందజేశారు.