మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. ఏప్రిల్ 10వ తేదీ బుధవారం ఉదయం పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా గోదావరిఖని 1వ బొగ్గు గనిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారానికి వచ్చిన కొప్పులను సింగరేణి మహిళా కార్మికులు నిలదీశారు.
సింగరేణిలో మహిళా కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అధికారంలో ఉన్నప్పుడు సమస్యలు ఎందుకు పరిష్కరించలేదని వారు ప్రశ్నించారు. కార్మిక సమస్యలు పరిష్కరించకుండా మళ్ళీ ఓట్లు ఆడిగేందుకు కార్మికుల వద్దకు ఎందుకు వచ్చారని మహిళ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రచారం నుండి కొప్పుల ఈశ్వర్ వెనుదిరిగి వెళ్లిపోయారు.