యైటింక్లయిన్ కాలనీ, వెలుగు : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వీర్లపల్లి సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడు చనిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. సింగరేణి అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో జనరల్ మజ్దూర్ గా డ్యూటీ చేస్తున్న గోదావరిఖని తిలక్ నగర్ కు చెందిన శశికుమార్ డ్యూటీ ముగించుకొని బైక్ పై యైటింక్లయిన్ కాలనీ.. -పోతన కాలనీ మీదుగా ఇంటికి వెళ్తున్న క్రమంలో వీర్లపల్లి సమీపంలోని డాంబర్ ప్లాంట్ మూలమలుపు వద్ద కల్వర్ట్ ను ఢీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. టూ టౌన్ సీఐ అఫ్జలుద్దీన్ఘటనా స్థలాన్ని పరిశీలించి డెడ్ బాడీని గోదావరిఖని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడి తండ్రి మొండయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.