సింగరేణి కళాకారుడికి జాతీయ కళారత్న అవార్డు

సింగరేణి కళాకారుడికి జాతీయ కళారత్న అవార్డు

గోదావరిఖని, వెలుగు : సింగరేణి కార్మికుడు, డోలక్‌‌‌‌‌‌‌‌ పొన్నాల శంకర్​కు జాతీయ కళారత్న ఆవార్డును అందుకున్నారు. సోమవారం మహారాష్ట్రలోని పూణెలో జరిగిన కార్యక్రమంలో బహుజన సాహిత్య ఆకాడమీ సంస్థ అధ్యక్షులు రాధాకృష్ణ ఈ అవార్డును అందజేశారు.

శంకర్​ సింగరేణి జీడీకే 11వ గనిలో కార్మికుడిగా పనిచేస్తూ కళాకారుడిగా కోల్​ఇండియా  పోటీలకు హాజరయ్యారు. శంకర్​కు అవార్డు రావడంపై స్థానిక కళాకారులతో పాటు సింగరేణి ఆఫీసర్లు శుభాకాంక్షలు తెలిపారు.