కోల్ బెల్ట్: సింగరేణి కార్మికుల సొంతింటి కలను నెరవేర్చలా కృషి చేస్తానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా కేకే–-5, కాసిపెట్-1 బొగ్గు గనులపై సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో జరిగిన ‘సింగరేణి ఉజ్వల ప్రగతి– ఉద్యోగుల పాత్ర’ అవగాహన కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడారు.
గత పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో సింగరేణి కార్మికులకు సంస్థకు న్యాయం జరగలేదన్నారు.. ఎంపీ వంశీకృష్ణ. మొదటిసారి పార్లమెంట్స్పీచ్లో సింగరేణి కార్మికుల కోసమే మాట్లాడానని గుర్తుచేశారు. సింగరేణి ప్రైవేటీకరణను విరమించుకోవాలని, బొగ్గు బ్లాకుల యాక్షన్ విధానం వద్దని డిమాండ్ చేశానని తెలిపారు. వచ్చే రోజుల్లో సింగరేణి కార్మికులకు ప్రభుత్వపరంగా ప్రయోజనాలు ఇప్పిస్తానని చెప్పారు.