అమ్మాయి మైనర్గా ఉన్పప్పటి నుంచే జానీ మాస్టర్ లైంగిక వేధింపులు : సింగర్ చిన్మయి

అమ్మాయి మైనర్గా ఉన్పప్పటి నుంచే జానీ మాస్టర్ లైంగిక వేధింపులు : సింగర్ చిన్మయి

ప్రముఖ టాలీవుడ్ డాన్స్ కొరియోగ్రాఫర్ షేక్ జానీ భాష అలియాస్ జానీ మాస్టర్ పై అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణల కింద పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్​ కు చెందిన ఓ మహిళా కొరియోగ్రాఫర్ ని కొన్ని రోజులుగా జానీ మాస్టర్.. తనను లైంగికంగా వేధిస్తున్నాడని హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేసింది.

ఇదిలా ఉంటే..జానీ మాస్టర్‌పై అత్యాచార ఆరోపణల విషయంపై..తాజాగా సింగర్ చిన్మయి శ్రీపాద (Chinmayi sripada)  స్పందించింది. చిన్మయి పలు మీడియా కథనాలను ట్యాగ్ చేస్తూ ..‘జానీ మాస్టర్ ఆ అమ్మాయి మైనర్‌గా ఉన్నప్పటి నుంచే వేధించడం మొదలుపెట్టాడని., ఈ కేసులో ఆ అమ్మాయికి పోరాడేందుకు కావాల్సిన శక్తి చేకూరాలని కోరుకుంటున్నా’ అని చిన్మయి ట్వీట్ చేశారు. ప్రస్తుతం చిన్మయి  చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

తెలుగు, తమిళ భాషల్లో తన గొంతుతో..తన పాటలతో దగ్గరైన సింగర్ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripaada). సమాజంలో ఆడవాళ్లకు ఏ సమస్య వచ్చిన..బయట మానవ మృగాల చేతిలో ఎవరైనా అఘాయిత్యానికి గురైన..సోషల్ మీడియాలో చిన్మయి స్పందిస్తుంది.

కొన్నిసార్లు ఆమె స్పందించడం వల్ల జరిగిన ఇస్స్యూ ఏదైతే ఉందో..క్షణాల్లో వైరల్ అయిపోయి..అందరూ రియాక్ట్ అయ్యేలా చేస్తోంది.ఆడవారిని హింసించడం, వేధించడం లాంటివి చేస్తే తనదైన రీతిలో స్పందించే చిన్మయి తాజాగా జానీ మాస్టర్ విషయంలో కూడా ఘాటుగా స్పందించింది.