
తెలుగు, తమిళ భాషల్లో తన గొంతుతో..తన పాటలతో దగ్గరైన సింగర్ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripaada). సమాజంలో ఆడవాళ్లకు ఏ సమస్య వచ్చిన..బయట మానవ మృగాల చేతిలో ఎవరైనా అఘాయిత్యానికి గురైన..సోషల్ మీడియాలో చిన్మయి స్పందిస్తుంది. కొన్నిసార్లు ఆమె స్పందించడం వల్ల జరిగిన ఇస్స్యూ ఏదైతే ఉందో..క్షణాల్లో వైరల్ అయిపోయి..అందరూ రియాక్ట్ అయ్యేలా చేస్తోంది.ఆడవారిని హింసించడం, వేధించడం లాంటివి చేస్తే తనదైన రీతిలో స్పందించే చిన్మయి తాజాగా సీనియర్ నటి అన్నపూర్ణపై ఘాటుగా స్పందించింది.
అన్నపూర్ణ ప్రస్తుతం బామ్మ పాత్రల్లో నటిస్తూ..పలు టీవీ షోల్లో కనిపిస్తూ బిజీగా మారింది. అయితే అన్నపూర్ణమ్మ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆడవారి గురించి, వారిపై జరిగే అత్యాచారాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
‘అర్ధరాత్రి స్వతంత్రం అనగానే ఆరోజుల్లో ఆడవాళ్లు బయటకు వచ్చేవాళ్లా? ఎందుకు స్వాతంత్య్రం కావాలి ఆడదానికి? రాత్రి 12 గంటల తర్వాత బయట ఏం పని? ఇప్పుడు ఎక్స్‌పోజింగ్ చాలా ఎక్కువైపోయింది.
అయితే..ఎవరూ మనల్ని ఏమీ అనొద్దు అనుకున్నా..అందరూ మనల్ని ఏదో ఒకటి అనేట్లుగానే రెడీ అవుతున్నాం. ఎప్పుడూ ఎదుటివాళ్లది తప్పు అనకూడదు. మనవైపు కూడా కొంచెం తప్పు ఉంటుంది” అంటూ అన్నపూర్ణమ్మ చెప్పుకొచ్చింది.
ఈ వీడియోలో మాట్లాడిన అన్నపూర్ణ పై సింగర్ చిన్మయి ఫైర్ అయ్యింది. 'తనకు నచ్చిన ఒక సీనియర్ నటి ఇలా ఆడవాళ్ళ స్వతంత్రం గురించి మాట్లాడడం గుండె పగిలినట్లుగా అనిపిస్తుందని..నాకు నచ్చిన అన్నపూర్ణమ్మ ఇలా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని తెలిపింది. అయితే ఆమె ఉద్దేశ్యంలో..'అర్ధరాత్రి బయట ఎలాంటి హాస్పిటల్స్, డాక్టర్స్ ఉండరని, వాళ్ళందరూ అమ్మాయిలు కాబట్టి అర్ధరాత్రి ఇంట్లోనే ఉంటారని వివరిస్తూ చెప్పుకొచ్చింది.
అంతేకాకుండా ఏదైనా సడెన్ హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా, యాక్సిడెంట్ అయినా సూర్యోదయం, సూర్యాస్తమయానికి మధ్యలోనే జరగాలని, ఒకవేళ అర్ధరాత్రి జరిగితే..ఇక అమ్మాయిలను ఇంట్లోనే ఉంచాలని చెప్పుకొచ్చింది. ఆమె చెప్పినట్లు చేస్తే..పుట్టే పిల్లలు కూడా అర్ధరాత్రి పుట్టకూడదు అని, డెలివరీ చేసే గైనకాలజిస్టులు కూడా హాస్పిటల్ లో ఉండరని (ఉండకూడదు కాబట్టి అని తెలిపింది).
ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఇంట్లో వాష్‌రూమ్స్ లేక తెల్లవారుజామున పొద్దున్నే 3 గంటలకు లేచి పొలం గట్టుకు వెళ్తున్న ఆడవాళ్లు ఇంకా చాలామంది ఉన్నారని గుర్తు చేసింది. అంతేకాదు పొలాల వైపు వెళ్లే ఆడవాళ్ళపై అఘాయిత్యాలకు పాల్పడే మగవాళ్ళు కూడా ఉన్న సొసైటీ ఇది.
ALSO READ :-మహారాష్ట్రలో మళ్లీ రిజర్వేషన్ల రగడ.. మూడు జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్
కేవలం అమ్మాయిల వేషధారణ వలనే అత్యాచారాలు జరుగుతున్నాయని అనుకునే ఇలాంటివారు బతుకుతున్న ఇండియాలో..ఆడపిల్లలుగా పుట్టడం మన కర్మ అని' చిన్మయి తనదైన శైలిలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వీరిద్దరి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.