
హైదరాబాద్ సిటీ, వెలుగు : లక్నోతో జరిగిన ఎస్‌ఆర్‌హెచ్ రెండో మ్యాచ్కు అభిమానులు భారీగా తరలిరావడంతో ఉప్పల్ స్టేడియం జనసంద్రంగా మారింది. మ్యాచ్కు ముందు సంగీత దర్శకుడు తమన్, సింగర్ గీతా మాధురి తమ మ్యూజికల్షోతో అభిమానుల్లో జోష్ నింపారు.
ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన సన్ రైజర్స్ 190 పరుగులు చేయగా, లక్నో ఈ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించడంతో హైదరాబాదీలకు నిరాశే మిగిలింది.