
సింగర్ కల్పన ఆరోగ్య పరిస్థితిపై తన కూతురు దయ ప్రసాద్ ఇవాళ (మార్చి 5న) స్పందించింది. మా అమ్మ, సినీ నేపథ్యగాయని కల్పన సూసైడ్ చేసుకోవాలని అనుకోలేదని ఆమె కుమార్తె చెప్పింది. ఇన్సోమియా నేపథ్యంలోనే డాక్టర్లు సూచనల మేరకే తీసుకున్న టాబ్లెట్, హై డోస్ తీసుకోవడం వల్లే అపస్మారక స్థితిలోకి వెళ్ళిందని మీడియా ద్వారా తెలిపింది.
అంతేకానీ, మా ఫ్యామిలీలో ఎటువంటి గొడవలు లేవని, అమ్మ, నాన్న బాగుంటారని క్లారిటీ ఇచ్చింది. అలాగే, ప్రస్తుతం తన తల్లి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతుందని వెల్లడించింది. పైగా, తొందరులోనే మళ్లీ ఎప్పటిలాగా మీ ముందుకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది.
Also Read:-సింగర్ కల్పన కేసులో బిగ్ ట్విస్ట్..
అయితే, కేరళలో తన పెద్ద కూతురు ఉంటుందని, తల్లి కల్పనతో హైదరాబాద్ కి రానని తెగేసి చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై ఫోనులో తల్లీ కుమార్తెల మధ్య వాగ్వాదం జరిగినట్టు రూమర్స్ ఊపందుకున్నాయి. ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ.. నిజం తెలుసుకోకుండా ఎటువంటి తప్పుడు సంకేతం బయటకి వెళ్లవద్దని మీడియాకు సూచించింది.
సింగర్ కల్పన ఆరోగ్య పరిస్థితి పై స్పందించిన కూతురు#KalpanaRaghavendra #SingerKalpana #singersunitha pic.twitter.com/1dP9e9Clbi
— Samba Siva Reddy Peram (@sivareddy_peram) March 5, 2025