నేను ఆత్మహత్యాయత్నం చేయలే.. వాళ్లపై చర్యలు తీసుకోండి: మహిళ కమిషన్‎లో సింగర్ కల్పన ఫిర్యాదు

నేను ఆత్మహత్యాయత్నం చేయలే.. వాళ్లపై చర్యలు తీసుకోండి: మహిళ కమిషన్‎లో సింగర్ కల్పన ఫిర్యాదు

హైదరాబాద్: ప్రముఖ సింగర్ కల్పన ఇటీవల అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అనారోగ్య సమస్యల కారణంగా ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లారని కల్పన కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే.. సింగర్ కల్పన నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యయత్యానికి పాల్పడ్డారని పలు మీడియా ఛానెల్స్‎తో పాటు.. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ప్రచారం చేశాయి. 

ఈ ప్రచారంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సింగర్ కల్పన శనివారం (మార్చి 8) రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదను కలిశారు. తాను నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నానంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తన ప్రైవేట్ వీడియోలతో ట్రోల్  చేస్తున్నాయని మహిళా కమిషన్లో ఫిర్యాదు చేశారు కల్పన. సీప్లింగ్ పిల్స్ మింగి తాను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నా వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. 

ALSO READ | హీరోయిన్ ని వేధించిన కేసులో స్టార్ నటుడికి బిగ్ రిలీఫ్..

కాగా, మార్చి 4వ తేదీన సింగర్ కల్పన అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ నిజాంపేట్‎లోని ఓ అపార్ట్ మెంట్లో నివాసం ఉంటోన్న కల్పన.. ఇంటి డోర్ తీయకపోవడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. కల్పన ఇంటికి చేరుకున్న పోలీసులు ఆమె అపార్ట్ మెంట్ తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా.. అప్పటికే ఆమె ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. పోలీసులు హుటాహుటిన సింగర్ కల్పనను నిజాంపేట్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి  తరలించారు. ఆసుపత్రిలో సింగర్ కల్పన కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.