Singer Kalpana: నా భర్తతో ఎలాంటి విభేదాలు లేవు.. ఆసుపత్రి నుంచి సింగర్ కల్పన వీడియో రిలీజ్

Singer Kalpana: నా భర్తతో ఎలాంటి విభేదాలు లేవు.. ఆసుపత్రి నుంచి సింగర్ కల్పన వీడియో రిలీజ్

సింగర్‌ కల్పనా రాఘవేంద్ర ప్రస్తుతం పుర్తిగా కోలుకుంది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా (మార్చి 7న) ఆసుపత్రి నుండి ఓ వీడియో రిలీజ్ చేసింది. తన భర్తపై మీడియాలో వస్తోన్న తప్పుడు కథనాలపై స్పందించింది. కేవలం పని ఒత్తిడి వల్ల నిద్ర పట్టకపోవడంతోనే టాబ్లెట్స్‌ వేసుకున్నట్లు కల్పన వీడియో ద్వారా చెప్పుకొచ్చింది. అలాగే తన భర్తపై మీడియాలో తప్పుడు వార్తలు ప్రసారం చేయకండి అంటూ కల్పన రిక్వెస్ట్‌ చేశారు.

వీడియోలో కల్పన మాట్లాడుతూ.. "మీడియాలో నా గురించి.. నా భర్త గురుంచి ఒక తప్పుడు వార్తా ప్రసారం అవుతుంది. ప్రస్తుతం నా వయస్సు 45 సంవత్సరాలు. ఈ వయసులో కూడా పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌బీ చేస్తున్నాను. ఇదంతా నా భర్త సహకారం వల్లే చేయగలుగుతున్నాని కల్పన చెప్పింది. అలాగే మ్యూజికల్ ఫీల్డ్ లో చాలా ఈవెంట్స్ కి వెళ్లాల్సి వస్తోంది. చాలా రోజులుగా మ్యూజికల్‌ ప్రోగ్రామ్స్‌లలో పాల్గొనడంతో నిద్ర పట్టడం లేదు. వర్క్‌ స్ట్రెస్‌ ఎక్కువగా ఉంది.

అందుకోసం వైద్యుల వద్ద చికిత్స తీసుకుంటున్నాను. వైద్యులు సూచించిన ప్రిస్క్రిప్షన్ లో టాబ్లెట్స్ ఓవర్ డోస్ తీసుకున్నాను. అందువల్లే స్పృహ తప్పి పడిపోయాను.  అంతేగానీ, నా భర్తతో నాకు ఎలాంటి మనస్పర్థలు లేవు. మా కుటుంబం చాలా అన్యోన్యంగా ఉందని రూమర్స్ పై కల్పన క్లారిటీ ఇచ్చింది.

ALSO READ | Sharwanand: శర్వానంద్ డబుల్ ట్రీట్.. కొత్త సినిమాల అప్డేట్స్ కమింగ్

నా భర్త సరైన సమయంలో స్పందించడం, కాలనీవాసుల, పోలీసుల సహాయం వల్ల నేను మీ ముందు ఉన్నాను. త్వరలోనే మళ్లీ నా పాటలతో మీ ముందుకు వస్తాను. నా జీవితానికి బెస్ట్ గిఫ్ట్ నా భర్త ప్రసాద్ ప్రభాకర్. ఆయనతో పాటు నా కూతురు సహకారం వల్లే నచ్చిన రంగాల్లో రాణిస్తున్నాను. నా ఆరోగ్యం గురించి స్పందించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు" అంటూ కల్పన వీడియో రిలీజ్ చేశారు. ఇక తను ప్రస్తుతం క్షేమంగా ఉన్నానని త్వరలోనే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతున్నట్లు తెలిపింది.