లతా మంగేష్కర్, మాతా అమృతానందమయి వీడియో మెసేజ్
రాఖీ విషెస్ చెబుతూ ట్వీట్
న్యూఢిల్లీ: రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి సింగర్ లతామంగేష్కర్, మాతా అమృతానందమయి విషెస్ చెప్పారు. ప్రధాన మంత్రిగా మోడీ చేస్తున్న కృషి ప్రశంసనీయమని 90 ఏళ్ల మంగేష్కర్ ట్వీట్ చేశారు. మోడీతో తాను దిగిన ఫొటోలతో వీడియో మాంటేజ్ను పోస్ట్చేశారు. ‘నేను రాఖీ పంపలేకపోతున్నా. కారణం ఏమిటో అందరికీ తెలుసు. దేశం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. దీన్ని ప్రజలెవరూ మర్చిపోరు. లక్షల మంది మహిళలు మీకు రాఖీ కట్టలేకపోవచ్చు. మీరు అర్థం చేసుకోవాలి. దేశాన్ని ముందుకు నడిపిస్తానని హామీ ఇవ్వాలి’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. లతా మంగేష్కర్ మెసేజ్ కు ప్రధాని మోడీ స్పందించారు. ‘లతా దీదీ.. రక్షా బంధన్ సందర్భంగా మీరు పంపిన ఎమోషనల్ మెసేజ్ నాకు స్ఫూర్తినిచ్చింది. లక్షల మంది తల్లులు, సోదరీమణుల ఆశీర్వాదంతో మన దేశం మరింత సక్సెస్ సాధిస్తుంది’ అని ట్వీట్ చేశారు. దేశం కోసం మోడీ గొప్పగా పని చేస్తున్నారని, ఆయనకు ఎప్పుడూ దేవుడి ఆశీస్సులు ఉంటాయని ఆధ్యాత్మిక గురువు మాతా అమృతానందమయి వీడియో మేసేజ్ పోస్ట్చేశారు. దీనిపై ‘దేశం కోసం పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా. మీతోపాటు మహిళా శక్తి ఆశీర్వాదం నాకు బలాన్నిస్తోంది. దేశ ప్రగతికి మహిళల ఆశీర్వాదం చాలా ముఖ్యం’ అని మోడీ ట్వీట్ చేశారు.
For More News..