Singer Mano: ఓ మహిళ అభిమాని చేసిన పనికి ఎమోషనలైన సింగర్ మనో

Singer Mano: ఓ మహిళ అభిమాని చేసిన పనికి ఎమోషనలైన సింగర్ మనో

ప్రముఖ సింగర్ మనో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నేడు (మార్చి 20న) మనో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వాదాలు అందుకున్నారు.

ఈ నేపథ్యంలో గాయకుడు మనోతో అభిమానులు, భక్తులు సెల్ఫీలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఓ మహిళా అభిమాని తన పాదాలు తాకిన తర్వాత గాయకుడు మనో భావోద్వేగానికి గురయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. 

మనో దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి దక్షిణాదిలో సింగర్.. డబ్బింగ్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకు 35000కిపైగా  పాటలు పాడారు. అలాగే, 3000 కంటే ఎక్కువ ప్రత్యక్ష వేదికలపై కచేరీలలో పాల్గొన్నాడు. ప్రస్తుతం పాటలతో, అదే సమయంలో సూపర్ సింగర్, ఇండియన్ ఐడల్ వంటి షోలకు న్యాయనిర్ణేతగా కూడా పనిచేస్తున్నాడు.