పోలీసుల అదుపులో సింగర్ మనో ఇద్దరు కొడుకులు..వీళ్లు చేసిన నేరం ఏంటీ..?

పోలీసుల అదుపులో సింగర్ మనో ఇద్దరు కొడుకులు..వీళ్లు చేసిన నేరం ఏంటీ..?

ప్రముఖ తెలుగు, తమిళ గాయకుడు మనో (Mano) కుమారులను  చెన్నై వళసరవాక్కం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కోలీవుడ్ సినీ వర్గాల సమాచారం. వలసరవాక్కంలోని శ్రీదేవి కుప్పంలో ఉన్న ఓ రెస్టారెంట్‌లో ఇద్దరు వ్యక్తులపై దాడి చేసినందుకు గాను మనో కుమారులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

మంగళవారం రాత్రి (సెప్టెంబర్ 10)..మనో కుమారులు తన స్నేహితులతో కలిసి.. ఓ 16 ఏళ్ల బాలుడితో సహా, ఫుట్‌బాల్ మ్యాచ్‌కు వెళ్లి తిరిగి వస్తున్న మరో ఇద్దరు వ్యక్తులపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఆ వెంటనే అక్కడున్న స్థానికులు గాయపడిన యువకులను ఆసుపత్రికి తరలించారు.

ALSO READ | హీరో మోహన్ బాబు ఆస్థాన గేయ రచయిత కన్నుమూత.. ప్రముఖల సంతాపం

ఈ ఘటనలో గాయపడిన కృపాకరన్‌ ఫిర్యాదు మేరకు..వళసరవాక్కం పోలీసులు మనో కుమారులు రఫీ, షకీర్‌లను అదుపులో తీసుకోగా..మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. తీవ్రంగా గాయపర్చడం వంటి వివిధ సెక్షన్ల కింద వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్న ఈ కేసు గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

గాయకుడు మనో, ఇప్పటి వరకు 35000 పాటలు పాడారు. అలాగే, 3000 కంటే ఎక్కువ ప్రత్యక్ష వేదికలపై కచేరీలలో పాల్గొన్నాడు. ప్రస్తుతం పాటలతో, అదే సమయంలో సూపర్ సింగర్, ఇండియన్ ఐడల్ వంటి షోలకు న్యాయనిర్ణేతగా కూడా పనిచేస్తున్నాడు.