
టాలీవుడ్ లో పాడుతా తీయగా సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ సునీత, రైటర్ చంద్రబోస్ పాడుతా తీయగా ప్రోగ్రామ్ లో తనను వేధించారని ఆరోపించారు. మానసికంగా నన్ను ఇబ్బంది పెట్టారని వ్యాఖ్యానించారు.
కీరవాణి, సింగర్ సునీత తనను సెట్లో బాడీ షేమింగ్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు ప్రవస్తి .ఎక్స్ ఫోజ్ చేయాలంటూ సెట్లో తనను ఎంతో ఇబ్బంది పెట్టారని చెప్పారు.. షోలో తనపై పక్షపాతం చూపారని టార్గెట్ చేశారని సెల్పీ వీడియో రిలీజ్ చేశారు. ప్రవస్తీ ఆరోపణలు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి.
పాడుతా తీయగా ప్రోగ్రాంలో జడ్జిలుగా ఉన్న కీరవాణి,సునీత,చంద్రబోస్ ప్రవర్తన నన్ను చాలా బాధించింది. తాను కంపోజ్ చేసిన సినిమాలోని పాటలు పాడితేనే కీరవాణి ఎక్కువ మార్కులు ఇచ్చేవారు.పెళ్లిలో పాట పాడిన నన్ను చాలా అసహ్యంగా మాట్లాడారు.. పెళ్లిలో పాటలు పాడేవాళ్లు అసలు సింగర్స్ కాదంటూ కీరవాణి అవమానించారు.
సింగర్ సునీత అనుకున్నంత సాఫ్ట్ కాదు. నాపై కక్ష కట్టింది. స్టేజ్ మీదకు రాగానే ఒక రకంగా పేస్ పెట్టేవారు. ముఖంపైనే మాటలు అనేవారు. లిరిక్స్ తప్పుగా ఉన్నా చంద్రబోస్ మార్కులు ఇచ్చేవారు. నా తప్పు లేకున్నా నన్ను తిట్టేవారు. నన్ను ఎప్పడు చీడ పురుగు లాగా చూసే వాళ్ళు . ప్రొడక్షన్ వాళ్ళు చీర బొడ్డికిందకి కొట్టుకోవాలని, ఎక్స్పోజింగ్ చేయాలని ఫోర్స్ చేసే వాళ్ళు. నేను తమిళంలో ఎన్నో పాటలు పాడా..కానీ ఎప్పుడూ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు.
ఓ ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ లో పాపులర్ షో పాడుతా తీయగా ప్రోగ్రామ్ కు గతంలో ఎస్పీ బాల సుబ్రమణ్యం జడ్జిగా ఉండేవారు. ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, సింగర్ సునీత, గేయ రచయిత చంద్రబోస్ జడ్జిలుగా ఉన్నారు. ఎంతో మంది యువ సింగర్స్ ఈ షోలో సత్తా చాటి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. చాలా మంది సింగర్ రాణిస్తున్నారు.
కీరవాణి, సునీత, చంద్రబోస్లపై సింగర్ ప్రవస్తి సంచలన ఆరోపణలు
— Ramesh Pammy (@rameshpammy) April 21, 2025
👉‘పాడుతాతీయగా’ షోలో జడ్జీలు వివక్ష చూపిస్తున్నారు.
👉బాడీ షేమింగ్తో పాటు పెళ్లిళ్లలో పాడానంటూ అవమానించారు.
👉బొడ్డు కిందకి చీర కొట్టుకోవాలని, ఎక్స్పోజింగ్ చేయాలని ప్రొడక్షన్ టీమ్ నుంచి ఒత్తిడులు
- సింగర్ ప్రవస్తి… pic.twitter.com/uWIfIgr25q