నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదు.. రాహుల్ సిప్లిగంజ్

నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదు..  రాహుల్ సిప్లిగంజ్

టాలీవుడ్ సింగర్ రాహుల్(Rahul sipliganj) సిప్లిగంజ్ రాజకీయ ప్రవేశంపై మూడు రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. తెలంగాణ(Telangana)లో త్వరలో ఎలక్షన్స్ రానున్న నేపథ్యంలో.. రాహుల్ సిప్లిగంజ్ గోషామహల్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించాడు రాహుల్ సిప్లిగంజ్. ఈమేరకు ఓ నోట్ కూడా రిలీజ్ చేశారు. తను రాజకీయాల్లోకి వస్తున్నట్టు, గోషామహల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టు వస్తున్న వార్తలని ఖండిస్తూ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.

నేను రాజకీయాల్లోకి  రావడంలేదు. ఈ విషయంపై నా మీద చాలా రూమర్స్ వైరల్ అవుతున్నాయి. నేను గోషామహల్ ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నానని వస్తున్న వార్తల్లో నిజంలేదు. అన్ని పార్టీల లీడర్స్ నేను గౌరవిస్తాను. నేను ఒక మ్యుజిషియన్ అండ్ ఆర్టిస్ట్ ను మాత్రమే. నా జీవితం అంతా కూడా నేను అలానే ఉంటాను. ప్రస్తుతానికి నా కెరీర్ పైనే ఫోకస్ చేస్తున్నాను. మిగతావాటి గురించి ఆలోచించే సమయం కూడా నాకు లేదు. దయచేసి ఇకనైనా ఈ రూమర్స్ ఆపేయండి అని తెలిపాడు రాహుల్ సిప్లిగంజ్. దీంతో రాహుల్ సిప్లిగంజ్ రాజకీయ రంగప్రవేశంపై వస్తున్న రూమర్స్ కు చెక్ పడింది.