
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో సింగర్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన రమణ గోగుల (Ramana Gogula) సెకండ్ ఇన్నింగ్స్ అదిరిపోయేలా ఉంది. వరుస తెలుగు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. ‘గోదారి గట్టు మీద రామ సిలక’నే అంటూ ఆయన పాడిన పాటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. 200 మిలియన్స్ కి పైగా దూసుకెళ్లింది. దాంతో మరో స్టార్ హీరో సినిమాలో ఓ పాట పాట పాడే అవకాశం వచ్చినట్లు సమాచారం. అది కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో.
దశాబ్ధ కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న రమణ గోగులను, పట్టుబట్టి ఇండియాకి తీసుకొచ్చిన అనిల్ రావిపూడి, తన నెక్స్ట్ సినిమాలో మరో పాటను పాడించబోతున్నట్లు టాక్. అనిల్ రావిపూడి తన తర్వాతి సినిమాను చిరంజీవితో చేయనున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియోనే స్వరాలూ సమకూరుస్తున్నట్లు తెలుస్తోంది.
అందులో భాగంగా ఓ పెప్పీ ట్యూన్ను భీమ్స్ కంపోజ్ చేస్తున్నాడట. అంతేకాకుండా ఇది ఫోక్ స్టైల్లో మాస్ టచ్తో ఉండే అదిరిపోయే సాంగ్ అని సినీ వర్గాల సమాచారం. ఇప్పటికే, ఈ ట్యూన్ని చిరు సైతం విన్నాడట. పాటని పూర్తిగా సెట్ పైకి తీసుకెళ్లాక, అంచనాలు అమాంతం పెరిగిపోవడం ఖాయం అని చెప్పాడట. త్వరలో ఈ పాటకు సంబంధించిన మరిన్ని విషయాలు రాను రానూ తెలుస్తోంది.
తమ్ముడు, బద్రీ, జానీ, లక్ష్మీ, యోగి లాంటి చిత్రాలతో మ్యూజిక్ డైరెక్టర్‌గా, సింగర్‌గా మెప్పించారు రమణ గోగుల. ఇప్పుడు గోదారి గట్టు మీద సాంగ్తో తన మెస్మరైజ్ గొంతుతో అందరికీ పండుగ తెచ్చారు. దాంతో ప్రతీ మ్యూజిక్ డైరెక్టర్ తనతో పాటలు పాడించడానికి వినూత్నమైన ట్యూన్స్తో పాటలు కంపోజ్ చేస్తున్నారట. త్వరలో రమణ గోగుల రాబోయే సినిమాల అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది.
ఇకపోతే, ప్రస్తుతం అనిల్-చిరు మూవీ స్క్రిప్ట్ వర్క్ డైలాగ్ వెర్షన్తో కలిపి ఫస్టాఫ్ కంప్లీట్ అయిందని టాక్. మరో రెండు నెలల్లో షూటింగ్కి తీసుకెళ్లి, వచ్చే సంక్రాంతికి థియేటర్స్ లోకి తీసుకొచ్చేలా అనిల్ ప్లాన్ చేస్తున్నాడట.