
ఈమధ్య కాలంలో కొందరు కేటుగాళ్లు సెలబ్రెటీల సోషల్ మీడియాలను హ్యాక్ చేస్తూ దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ చేసిన తర్వాత అసభ్యకర ఫోటోలు, అశ్లీల వీడియోలు పోస్ట్ చెయ్యడం వంటివి చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఒక్కసారి లింక్ పై క్లిక్ చేస్తే క్షణాల్లో బ్యాక్ అకౌంట్ లోని డబ్బు, ఫోన్ లో విలువైన డేటా చోరీ చేసే లింకులు హెసెరు చేస్తూ ఆర్ధిక మోసాలకి పాల్పడుతున్నారు.
అయితే ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ ట్విట్టర్ ఖాతాని గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. దీంతో ఈ విషయాన్ని శ్రేయా ఘోషల్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. ఇందులోభాగంగా తన "అభిమానులకు మరియు స్నేహితులకు నమస్కారం. ఫిబ్రవరి 13 నుండి నా ట్విట్టర్ / X ఖాతా హ్యాక్ చేయబడింది. X బృందాన్ని సంప్రదించడానికి నా శక్తి మేరకు నేను అన్ని ప్రయత్నాలు చేసాను. కానీ కొన్ని ఆటో జనరేట్ అయిన ప్రతిస్పందనల కంటే ఎక్కువ స్పందన రాలేదు. నేను ఇకపై లాగిన్ అవ్వలేనందున నా అకౌంట్ ని డిలీట్ చెయ్యలేకపోతున్నాను. దయచేసి ఏ లింక్‌పై క్లిక్ చేయవద్దు లేదా ఆ ఖాతా నుండి వచ్చిన మెసేజెస్ ని నమ్మవద్దు". అని పేర్కొంది. అలాగే అకౌంట్ రిట్రీవ్ అయిన తర్వాత సేఫ్ గా ఉంటే వీడియో ద్వారా అప్‌డేట్ చేస్తానని" తెలిపింది. దీంతో కొందరు నెటిజన్లు స్పందిస్తూ సోషల్ మీడియా ప్రైవసీ, సెక్యూరిటీ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని లేకపోతే సులభంగా మన వ్యక్తిగత సమాచారం హ్యాకర్స్ చేతికి చిక్కే అవకాశం ఉందని అంటున్నారు.
ALSO READ : డిమాండ్ ఇదే: మార్చి 22 కోసం ఎదురుచూస్తున్నా.. అభిమానుల సపోర్ట్ కోరుతూ రాజమౌళి వీడియో రిలీజ్
ఈ విషయం ఇలా ఉండగా సింగర్ శ్రేయా ఘోషల్ భాషతో సబందం లేకుండా దేశంలోని దాదాపు అన్ని భాషలలో పాటలు పాడి తన గానంతో ఆడియన్స్ ని అలరించింది. ఇప్పటివరకూ 20 భాషలలో 3000 కంటే ఎక్కువ పాటలు పాడింది. అంతేకాదు నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులు మరియు ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా మరిన్ని అవార్డులు అందుకుంది.