Sri Krishna: దివ్యాంగులతో కలిసి రోడ్డుపై పాట పాడిన సింగర్ శ్రీకృష్ణ

మనందరం మనుషులం..ఒకరికోసం ఒకరం ఆలోచించకున్న..ఒకరి బాధ చూసి చలించే మనుషులం. సమయానికి తోడు రాకున్నా..కష్టం ఉందనే మాట వినగానే..పరుగెత్తికెళ్ళి బాసటగా నిలిచే మనుషులం.

ఇలాంటి వ్యక్తులుగా ఉన్న మనం రోడ్డుపైన వెళ్తుంటే ఎన్నో చూస్తూ వెళుతుంటాం. కానీ, కొన్నిసార్లు మాత్రమే సడెన్ గా ఆగిపోవాలనిపిస్తోంది.కాసేపు అలాగే ఉండాలనిపిస్తోంది. అదెక్కడో తెలుసా..రోడ్లపైన దివ్యాంగులు సంగీత కచేరి చేసేటప్పుడు. వారి వేణువుతో..వారి స్వచ్ఛమైన గొంతులో నుంచి వచ్చిన పాట వింటుంటే అలానే ఉండిపోవాలనిపిస్తోంది. మనం వాళ్ళకి లోకల్ టాలెంట్ అని ముద్ర వేశాం కానీ, వాళ్ళని కనుక ట్రైన్ చేసి..మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక్క అవకాశం ఇస్తే మాత్రం 'ది బెటర్ సింగర్' అని పిలుచుకుంటాం.

అయితే లేటెస్ట్ వివరాల్లోకి వెళితే..సింగర్ శ్రీ కృష్ణ (Sri Krishna)..తెలుగులో టాప్ సింగర్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శ్రీ కృష్ణ చేసిన మంచిపనికి అతన్ని ప్రశంసించకుండా ఉండలేరు. 

తాజాగా శ్రీ కృష్ణ తన ఇంస్టాగ్రామ్ నుండి షేర్ చేసిన ఓ వీడియో ఆకట్టుకుంటోంది.ఈ వీడియోలో రోడ్డుపైన పాటలు పాడుకునే దివ్యాంగుల పాటకి తన గొంతుని పంచుకున్నాడు.అభినందన సినిమాలోని ప్రేమ ఎంత మధురం అనే పాటను వారితో కలిసి పాడిన శ్రీ కృష్ణ తన యొక్క ఫీలింగ్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ..

"రాగ మాధురి ఆర్కెస్ట్రాలోని ప్రముఖ సంగీత విద్వాంసులకు వందనం.మీలో ఉన్న సంగీత సామర్థ్యాలు..మీరు ఎదుర్కొనే సవాళ్లను అధిగమించగలవు. ఇవాళ మీతో కలిసి పాడడం మరియు మీ అద్భుతమైన ప్రతిభను ప్రత్యక్షంగా చూడడం చాలా గౌరవంగా ఉంది. విరాళాలు ఇవ్వడం మరియు ప్రచారం చేయడం ద్వారా ఈ అసాధారణ వ్యక్తులకు మద్దతు ఇవ్వడంలో..ప్రతి ఒక్కరూ నాతో చేరాలని నేను వినమ్రంగా అందరినీ అభ్యర్థిస్తున్నాను.

కచేరీలు మరియు బుకింగ్‌ల గురించి విచారణల కోసం, దయచేసి వారిని 9908225363 నంబర్‌లో సంప్రదించండి. వారి సంగీత నైపుణ్యాన్ని సెలబ్రేట్ చేసుకుందాం..వారిని శక్తివంతం చేస్తూ ప్రపంచం ముందుకు తీసుకెళ్దాం అంటూ పోస్ట్ చేశారు".

దీంతో శ్రీ కృష్ణ చేసిన పోస్ట్ లో వారి టాలెంట్ ను ప్రశంసిస్తూ..వారికి సంబంధించిన ఫోన్ పే స్కానర్ వివరాలను  తెలుపడంతో..శ్రీ కృష్ణ గ్రేట్ అని కొందరంటుంటే..ఒక కళాకారుడికి ముఖ్యంగా..ఉండల్సిన మొదటి లక్షణం నీలో చూశాను బ్రదర్..అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీ కృష్ణ పోస్ట్ వైరల్ అవుతుంది.