టాలీవుడ్ లో సింగర్ సునీత తన స్వరంతో సంగీత ప్రియులను అలరిస్తుంటారు. అద్భుతమైన ఎన్నో వందల పాటలు పాడి ఆమె సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రెండేళ్ల క్రితం వ్యాపారవేత్త, మ్యాంగో మ్యూజిక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రామకృష్ణ వీరపనేనిని రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 42 ఏళ్ల వయసులో ఆమె రెండో పెళ్లి చేసుకోవడం అప్పట్లో చర్చాంశనీయం అయింది. తాజాగా ఆమె గురించి ఒ రూమర్ వినిపిస్తోంది. సునీత ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియాలో న్యూస్ హల్చల్ చేస్తోంది. దీనిపై ఆమె స్పందించారు.
‘అవునా నేను ప్రెగ్నెంటా? నాకే తెలియదు. ఇది నాకు చెందిన విషయం కాదు. రూమర్స్క్రియేట్చేసిన వారి విచక్షణకే వదిలివేస్తున్నా.’ అని విమర్శించింది. ప్రస్తుతం సునీత మ్యూజిక్మాస్ట్రో ఇళయరాజా కన్సర్ట్లో వర్క్చేస్తున్నారు. ఆయన సారథ్యంలో పాడటం ఆనందంగా ఉందని, ‘నేను ఆయనకు వీరాభిమానిని’ అని సునీత చెబుతున్నారు. ఆమె కొడుకు ఆకాష్త్వరలో సర్కారు నౌకరి అనే సినిమాతో వెండితెరకు పరిచయం కాబోతున్నాడు.