Singer Sunitha: పాడుతా తీయగా ఫేమ్ ‘ప్రవస్తి’ ఆరోపణలను ఖండిస్తూ సింగర్ సునీత వీడియో రిలీజ్

Singer Sunitha: పాడుతా తీయగా ఫేమ్ ‘ప్రవస్తి’ ఆరోపణలను ఖండిస్తూ సింగర్ సునీత వీడియో రిలీజ్

పాడుతా తీయగా సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ సునీత, రైటర్ చంద్రబోస్ పాడుతా తీయగా ప్రోగ్రామ్ లో తనను వేధించారని వీడియో రిలీజ్ చేసి ఆరోపించింది. మానసికంగా నన్ను ఇబ్బంది పెట్టారని ఆ వీడియోలో తెలిపింది.

తాజాగా ప్రవస్తి చేసిన ఆరోపణలపై సింగర్ సునీత (Sunitha) స్పందించింది. ఈ మేరకు ప్రవస్తి వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండిస్తూ ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియో రిలీజ్ చేసింది. 

సింగర్ సునీత మాట్లాడుతూ.. ‘‘ప్రవస్తి.. నిన్ను బాల్యంలో పాడుతా తీయగా జడ్జెస్ ముద్దుచేసినట్టే, నేనూ కూడా ముద్దుచేశా. ఈ వయసులో కూడా అలా చేస్తే బాగుండదు కదా. చిన్నప్పుడు మంచిగా పాడినప్పుడు ఎంతో ప్రశంచించే వాళ్ళం. అలా షోలో ఎవరు బాగా పాడినా మేం లీనమై భావోద్వేగంతో ఏడ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయా ఎపిసోడ్స్‌ నువ్వు చూడలేదనుకుంటా. అలాంటి ప్రవస్తి ఇంతటి పెద్దదైపోయి మా గురించి చర్చించే స్థాయికి వెళ్లినందుకు అసంతృప్తిగా ఉంది.

నువ్వు ఎన్నో పోటీల్లో పాల్గొన్నావు కదా ప్రాసెస్‌ ఎలా ఉంటుందో నీకు తెలియదా? కొన్ని ఛానళ్లకు కొన్ని పాటలకే హక్కులుంటాయి. ఆడియన్స్‌కు ఇలా చెబితే అన్ని విషయాలు చెప్పు. అప్పుడు నిజంగా నేను సంతోషిస్తా. అలాగే నువ్వు చాలా సార్లు అప్సెట్ లో ఉన్నప్పుడు, దగ్గరికొచ్చి ఎంతో ప్రోత్సహించానాని’’అని సునీత అన్నారు.

అలాగే ప్రేక్షకులకు క్లారిటీ ఇస్తూ..'పాటల విషయంలో ఛానల్స్‌కు కొన్ని కండిషన్స్ ఉంటాయి. కాబట్టి అన్ని పాటలూ పాడే అవకాశం ఉండదు. రైట్స్‌ ఉన్నవి మాత్రమే పోటీలో పాడాలి. ఇలాంటి కండిషన్స్ కూడా చెబితే క్లారిటీ ఉంటుందని' సునీత వెల్లడించింది. 

సింగర్ ప్రవస్తి ఏమన్నదంటే:

పాడుతా తీయగా ప్రోగ్రాంలో జడ్జిలుగా ఉన్న కీరవాణి,సునీత,చంద్రబోస్  ప్రవర్తన నన్ను చాలా బాధించింది. తాను కంపోజ్ చేసిన సినిమాలోని పాటలు పాడితేనే కీరవాణి ఎక్కువ మార్కులు ఇచ్చేవారు.పెళ్లిలో పాట పాడిన నన్ను చాలా అసహ్యంగా మాట్లాడారు.. పెళ్లిలో పాటలు పాడేవాళ్లు అసలు సింగర్స్ కాదంటూ కీరవాణి అవమానించారు.  

►ALSO READ | PriyankaChopra: ప్రపంచ స్థాయి అవార్డు అందుకోనున్న నటి ప్రియాంక చోప్రా..

సింగర్ సునీత అనుకున్నంత సాఫ్ట్ కాదు. నాపై కక్ష కట్టింది. స్టేజ్ మీదకు రాగానే ఒక రకంగా పేస్ పెట్టేవారు. ముఖంపైనే మాటలు అనేవారు.   లిరిక్స్ తప్పుగా ఉన్నా చంద్రబోస్ మార్కులు ఇచ్చేవారు. నా తప్పు లేకున్నా నన్ను తిట్టేవారు. నన్ను ఎప్పడు చీడ పురుగు లాగా చూసే వాళ్ళు . ప్రొడక్షన్ వాళ్ళు చీర బొడ్డికిందకి కొట్టుకోవాలని, ఎక్స్పోజింగ్ చేయాలని ఫోర్స్ చేసే వాళ్ళు. నేను తమిళంలో ఎన్నో పాటలు పాడా..కానీ ఎప్పుడూ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. 

కీరవాణి, సింగర్ సునీత  తనను సె‌ట్లో బాడీ షేమింగ్ చేశారని  సంచలన ఆరోపణలు చేశారు ప్రవస్తి .ఎక్స్ ఫోజ్ చేయాలంటూ సెట్లో తనను ఎంతో  ఇబ్బంది పెట్టారని చెప్పారు.. షోలో తనపై పక్షపాతం చూపారని  టార్గెట్ చేశారని సెల్పీ వీడియో రిలీజ్ చేశారు.