
సింగరేణి కాలరీస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్‘మేనేజర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఎంపికయ్యారు. లండన్ లో శుక్రవారం రాత్రి ‘అచీవ్‍మెంట్స్ ఫోరం 2019’ కార్యక్రమంలో ఈ అవార్డును అందుకున్నారు. ‘గ్లో బల్ క్లబ్ ఆఫ్ లీడర్స్’ అధ్యక్షులు క్రిస్టినా బ్రిగ్స్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ యూరోప్ బిజినెస్ అలయెన్స్ ప్రొఫెసర్ జాన్ నెట్టింగ్ ఈ అవార్డును శ్రీధర్ కు అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా కొత్త తరహా ఆలోచనలతో కంపెనీలను విజయవంతంగా నడిపిస్తున్న వారికి ప్రతి ఏడాది అచీవ్‍మెంట్ ఫోరం అవార్డులు అందజేస్తుంది. మంచి నాయకత్వ లక్షణాలతో సింగరేణిని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నం దుకు నిర్వాహకులు శ్రీధర్‍ను ప్రశంసించారు. బొగ్గు పరిశ్రమపై ప్రసంగించిన సీఎండీ మ్యూనిచ్ ట్రేడ్ ఫెయిర్ లో సింగరేణి సీఎండీ శ్రీధర్ ప్రసంగిం చారు. ఇండియాలోని బొగ్గు పరిశ్రమ స్థితి గతులపై మాట్లాడారు. సింగరేణి సాధిస్తున్న ఫలితాలను వివరించారు. ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన ఈ ట్రేడ్ ఫెయిర్ 14వ తేదీ వరకు జరగనుంది. 200 దేశాలకు చెందిన ఆరు లక్షల మంది ప్రతినిధులు ట్రేడ్ ఫెయిర్ సందర్శి స్తారని అంచనా వేస్తున్నారు.