అమ్మ బాబోయ్.. ‘సింగం అగైన్’ సినిమాను అమెజాన్ ప్రైమ్ అంత పెట్టి కొన్నదా..!?

అమ్మ  బాబోయ్.. ‘సింగం అగైన్’ సినిమాను అమెజాన్ ప్రైమ్ అంత పెట్టి కొన్నదా..!?

బాలీవుడ్లో ప్రస్తుతం ‘సింగం అగైన్’ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఈ సినిమా ట్రైలర్ సోమవారం (అక్టోబర్ 7, 2024) విడుదలైంది. ‘సింగం అగైన్’ సినిమా ఓటీటీ హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయాయని గాసిప్స్ గుప్పుమన్నాయి. అమెజాన్ ప్రైమ్ ఏకంగా 130 కోట్ల రూపాయలకు ‘సింగం అగైన్’ సినిమా ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసిందని బీ టౌన్ కోడై కూస్తోంది.

హీరో అజయ్ దేవ్గన్ కెరీర్లో గానీ, డైరెక్టర్ రోహిత్ శెట్టి కెరీర్లో గానీ ఇదే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్ అని టాక్. ‘సింగం అగైన్’ శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ బిజినెస్ మరో 50 నుంచి రూ.70 కోట్లు జరిగిందని, మొత్తంగా ‘సింగం అగైన్’ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ ఓటీటీతో కలిపి 180 నుంచి 200 కోట్ల పైనే జరిగిందని ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు.

ALSO READ | EuphoriaTheFilm: జానర్ మార్చిన డైరెక్టర్ గుణశేఖర్.. థ్రిల్ చేసేలా యుఫోరియా మూవీ గ్లింప్స్

యాడ్స్, ప్రింట్ ఖర్చులతో కలిపి ‘సింగం అగైన్’ సినిమా బడ్జెట్ రూ.350 కోట్ల నుంచి రూ.375 కోట్ల వరకూ అయిందని అంచనా. మోస్ట్ కమర్షియల్ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్లో రోహిత్ శెట్టి ఒకరు. తమిళ్లో కార్తీక్ సుబ్బరాజ్, తెలుగులో హరీశ్ శంకర్ తరహా డైరెక్టర్. రోహిత్ శెట్టి తీసిన సినిమాలు దాదాపు ఎంటర్టైన్మెంట్ ప్రధాన కథాంశంగా సాగేవే. ‘చెన్నై ఎక్స్ప్రెస్’ సినిమా రోహిత్ శెట్టికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. 

తమిళ్లో సూర్య నటించిన ‘సింగం’ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేసి కమర్షియల్ హిట్ కొట్టిన ఈ డైరెక్టర్ 2014లో ‘సింగం రిటర్న్స్’తో ఆడియన్స్ను ఎంటర్టైన్ చేశాడు. పదేళ్ల తర్వాత 2024 నవంబర్ 1న ‘సింగం అగైన్’తో రోహిత్ శెట్టి తన అదృష్టాన్ని  మరోసారి పరీక్షించుకోబోతున్నాడు. ‘సింగం అగైన్’ ట్రైలర్లో అజయ్ దేవ్గన్, దీపికా పదుకొణె హంగామా కనిపించింది. సినిమా రిజల్ట్ కోసం నవంబర్ 1 వరకూ వేచి చూడాల్సిందే.