
పుల్కల్/వెలుగు : సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్ట్ కు శుక్రవారం రాత్రి వరద తాకిడి పెరిగింది. అప్రమత్తమైన ఆఫీసర్లు 11నంబర్ గేటును 1.5 మీటర్లు ఎత్తి దిగువకు 9654 క్యూసెక్కుల నీటిని వదిలారు. వదులుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 1460 క్యూసెక్కుల నీళ్లు విడుదల అవుతున్నాయి.
సింగూర్ ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం 29.589 టీఎంసీల నీరు నిల్వ ఉందని డిప్యూటీ ఈఈ నాగరాజు, ఎఈఈ మాహిపాల్ రెడ్డి తెలిపారు. మంజీరా నది పరివాహక ప్రాంతాల ప్రజలు, గొర్ల కాపరులు, చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు నది లోనికి వెళ్లరాదని ఇరిగేషన్ ఆఫీసర్లు సూచించారు.