
సెయింట్ లూసియా: ఇండియా గ్రాండ్ మాస్టర్ డి. గుకేశ్... సింక్యూఫీల్డ్ కప్ చెస్ టోర్నీని డ్రాతో మొదలుపెట్టాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో గుకేశ్.. వరల్డ్ చాంపియన్ డింగ్ లీరెన్ (చైనా)తో జరిగిన గేమ్‌ను డ్రాగా ముగించాడు. ఈ ఏడాది చివర్లో ఈ ఇద్దరి మధ్య వరల్డ్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్‌లో హోరాహోరీగా పోటీపడతారని భావించినా గుకేశ్ ఇటాలియన్ ఓపెనింగ్‌తో నెమ్మదిగా గేమ్ మొదలుపెట్టాడు. దీనికి పెద్దగా స్పందించని లీరెన్ కింగ్ సైడ్ అటాక్‌తో ముందుకెళ్లినా ఫలితం రాబట్టలేదు.
ఇక నొడిర్బెక్ అబ్దుసత్తారోవ్ (ఉజ్బెకిస్తాన్) జరిగిన గేమ్‌ను ప్రజ్ఞానంద డ్రా చేసుకున్నాడు. సెయింట్ లూసియా బ్లిట్జ్, ర్యాపిడ్‌లో నిరాశపర్చిన ప్రజ్ఞా ఈ గేమ్‌లో కొంత మెరుగైన ఆటతీరును చూపెట్టాడు. ఇతర మ్యాచ్‌ల్లో అలీరెజా ఫిరౌజ (ఫ్రాన్స్).. ఫ్యాబియానో కరువాన (అమెరికా)పై గెలవగా, వెస్లీ సో (అమెరికా).. అనిష్ గిరి (నెదర్లాండ్స్), ఇయాన్ నెపోమినెట్చి (రష్యా).. మాక్సిమ్ వాచిర్ లాగ్రెవ్ (ఫ్రాన్స్) మధ్య జరిగిన గేమ్‌లు డ్రాగా ముగిశాయి.