
2020–24 మధ్యకాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉక్రెయిన్ నిలవగా, ఆ తర్వాతి స్థానంలో భారత్ ఉన్నదని స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సిప్రీ) విడుదల చేసిన నివేదిక పేర్కొన్నది. 2015–19తో పోలిస్తే ఉక్రెయిన్ ఆయుధ దిగుమతులు 100 శాతం పెరిగాయని తెలిపింది.
ఇదే సమయంలో భారత ఆయుధ దిగుమతులు 9.3 శాతం తగ్గాయి. ఇదే కాలంలో ఐరోపా దేశాల ఆయుధ దిగుమతులు 155 శాతం పెరిగాయి. ఇందుకు రష్యా– ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా విదేశాంగ విధానంలో అనిశ్చితి కారణమయ్యాయి. ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో అమెరికా వాటా పెరిగి 43 శాతానికి చేరాయి. రష్యా ఎగుమతులు ఏకంగా 64 శాతం మేరకు పడిపోయాయి.
- 2022లో రష్యాతో యుద్ధం మొదలయ్యాక కనీసం 35 దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేశాయి. 2020–24లో ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో ఉక్రెయిన్ వాటా 8.8 శాతంగా ఉన్నది. ఈ దేశానికి అమెరికా 45 శాతం, జర్మనీ 12 శాతం, పోలెండ్11 శాతం నుంచే ఎక్కువ ఆయుధాలు అందాయి.
- 2020–24లో రష్యా ప్రధానంగా 33 దేశాలకు ఆయుధాలను విక్రయించింది. ఇందులో మూడింట రెండొంతులు భారత్ 38 శాతం, చైనా 17 శాతం, కజకిస్తాన్ 11 శాతం వెళ్లాయి.
- ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆయుధ ఎగుమతిదారుగా ఫ్రాన్స్ నిలిచింది. ఈ దేశం 65 దేశాలకు రక్షణ సామగ్రిని అందించింది. ఇందులో అత్యధికంగా 28 శాతం భారత్‌కు అందాయి.
- అంతర్జాతీయంగా భారత్ చేసుకున్న ఆయుధ దిగుమతుల్లో అధిక భాగం రష్యా (36 శాతం) నుంచే వచ్చాయి. ఈ వాటా 2015–19లో 55 శాతంగా, 2010–14లో 72 శాతంగా ఉండేది.
- పాకిస్తాన్ ఆయుధ దిగుమతుల్లో చైనా వాటా 81 శాతంగా ఉన్నది.
- అత్యధిక ఆయుధ దిగుమతి దేశాలు: ఉక్రెయిన్ 8.8 శాతం, భారత్8.3 శాతం, ఖతార్6.8శాతం, సౌదీ అరేబియా 6.8 శాతం, పాకిస్తాన్ 4.6 శాతం, జపాన్ 3.9 శాతం.
- అత్యధిక ఆయుధ ఎగుమతి దేశాలు: అమెరికా 43 శాతం, ఫ్రాన్స్ 9.6 శాతం, రష్యా 7.8 శాతం, చైనా 5.9 శాతం, జర్మనీ 5.6 శాతం, ఇటలీ 4.8 శాతం.