ENG vs PAK 1st Test: సచిన్ రికార్డ్ రూట్ బ్రేక్ చేయడం నేను చూస్తాను: అలెస్టర్ కుక్‌

ENG vs PAK 1st Test: సచిన్ రికార్డ్ రూట్ బ్రేక్ చేయడం నేను చూస్తాను: అలెస్టర్ కుక్‌

ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ టెస్ట్ క్రికెట్ లో అసలు తెగ్గేదే లేదంటున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా.. వేదిక ఏదైనా పరుగుల వరద పారిస్తున్నాడు. తాజాగా ముగిసిన ముల్తాన్ టెస్టులో 262 పరుగులు చేసి టెస్ట్ కెరీర్ లో అత్యధిక వ్యక్తగత స్కోర్ నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్ తో రూట్ పలు రికార్డ్స్ బ్రేక్ చేశాడు. ప్రస్తుతం ఈ ఇంగ్లాండ్ బ్యాటర్ టెస్టుల్లో 12664 పరుగులు చేశాడు. అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన సచిన్(15921) రికార్డుకు దగ్గరగా వస్తున్నాడు.

మరో 3300 పరుగులు చేస్తే ఆల్ టైం టెస్ట్ గ్రేట్ టెస్ట్ బ్యాటర్ గా నిలుస్తాడు. ఈ మ్యాచ్ లో అలెస్టర్ కుక్ (12472) రికార్డ్ బద్దలు కొట్టిన రూట్.. ఇంగ్లాండ్ టెస్ట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. పాకిస్థాన్ పై 142 పరుగుల వద్ద అతను ఈ ఘనతను అందుకున్నాడు. ఓవరాల్ గా ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. తన రికార్డ్ ను రూట్ బద్దలు కొట్టడంపై కుక్ స్పందించాడు. త్వరలో సచిన్ అత్యధిక పరుగుల రికార్డ్ ను సైతం రూట్ బద్దలు కొడతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. 

"సచిన్ టెండూల్కర్ రికార్డును రూట్ తిరగరాయాలని నేను చూస్తున్నాను. నేను రిటైర్ అయినప్పుడు నా రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉందని నేను అనుకున్నాను. మీరు ఇప్పటికీ సచిన్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. చాలా కాలం పాటు క్రికెట్ ఆడిన గొప్ప ఆటగాళ్లందరూ అదృష్టవంతులే. ఎందుకంటే గాయాలు కాకపోవడం అందరికీ కలిసొచ్చింది. రూట్ పరుగుల దాహాన్ని ఎవరూ ఆపలేరు". అని కుక్ చెప్పుకొచ్చాడు.

ముల్తాన్ టెస్టులో రూట్ బద్దలు కొట్టిన రికార్డులు :

టెస్టుల్లో అలెస్టర్ కుక్ రికార్డ్ బద్దలు కొట్టి ఇంగ్లాండ్ టెస్ట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. నిన్నటివరకు ఈ రికార్డ్ కుక్ (12472) పేరిట ఉండగా.. నేడు ముల్తాన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో అజేయ హాఫ్ సెంచరీతో రూట్ ఈ రికార్డ్ బ్రేక్ చేశాడు.   

కుక్ రికార్డ్ బ్రేక్ చేసిన రూట్ టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టులో టాప్ 5 లో చేరాడు. టీమిండియా దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ 15921 పరుగులతో టాప్ లో ఉన్నాడు. రికీ పాంటింగ్(13378), కల్లిస్(13289), రాహుల్ ద్రవిడ్ (13288) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.
   
టెస్టు కెరీర్ లో 35 సెంచరీలతో దిగ్గజాలను దాటేశాడు. దీంతో టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో ఆరో స్థానానికి చేరాడు. యూనిస్ ఖాన్, జయవర్ధనే, బ్రియాన్ లారా, గవాస్కర్ 34 సెంచరీలు చేశారు. ఈ లిస్టులో సచిన్ 51 సెంచరీలతో అగ్ర స్థానంలో ఉన్నాడు. కల్లిస్(45),రికీ పాంటింగ్ (41),సంగక్కర (38), రాహుల్ ద్రవిడ్(36) తర్వాత స్థానాల్లో నిలిచారు.
 
ఒకే క్యాలండర్ ఇయర్ లో 1000 కి పైగా పరుగులు 5 సార్లు చేశాడు. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లలో రూట్ టాప్. స్టీవ్ స్మిత్ నాలుగు సార్లు, విలియంసన్ రెండు సార్లు ఈ ఘనతను సాధించారు.