సర్ .. మా డాడీని కాపాడండి

సర్ .. మా డాడీని కాపాడండి
  • జగిత్యాల జిల్లా ప్రజావాణిలో కలెక్టర్ కు చిన్నారుల ఫిర్యాదు

జగిత్యాల టౌన్, వెలుగు:  నానమ్మ, బాబాయిలు తరచూ డాడీపై దాడి చేస్తూ చాలా రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్నారని ఇద్దరు చిన్నారులు ప్రజావాణికి వచ్చి కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేశారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం చర్లపల్లికి చెందిన చిన్నారులు శ్రీవత్సవ్(11), సాయి వైష్ణవి(9) సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణికి అటెండ్ అయి వినతిపత్రం అందజేశారు.

 అందులో తాత మల్లయ్య సింగరేణి రిటైర్డ్ కార్మికుడని, అతని డబ్బులు నాన్న వాడుకున్నాడని ఆరోపిస్తూ ఇంట్లో రోజూ లొల్లి అయితుందని పేర్కొన్నారు. వ్యవసాయం చేసుకోకుండా బాబాయ్‌‌‌‌ అడ్డుపడుతున్నాడని, నాన్నపై తరచూ దాడి చేస్తున్నారని, దీంతో తాము హ్యాపీగా ఉండలేకపోతున్నామన్నారు.  సర్‌‌‌‌‌‌‌‌.. ఎలాగైనా తమ ప్రాబ్లమ్‌‌‌‌ క్లియర్‌‌‌‌‌‌‌‌ చేయాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌ను వేడుకున్నారు. చిన్నారులు ఇచ్చిన కంప్లయింట్ ను కలెక్టర్ స్వీకరించి విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.