భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో మాటల యుద్ధం చోటు చేసుకుంది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్, ఆసీస్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. ఇన్నింగ్స్ 13 ఓవర్లో సిరాజ్ షార్ట్ ఆఫ్ లెంగ్త్ డెలివరీని వేశాడు. అయితే బంతి లబుషేన్ తొడకు తగిలి అక్కడే పడింది. అదే సమయంలో సిరాజ్ బంతిని తీసుకొని త్రో కొడదామని భావించాడు. ఇది గ్రహించిన మార్నస్.. బ్యాట్ తో బంతిని పక్కకు నెట్టాడు.
సిరాజ్ ను చూసి కావాలనే లబుషేన్ బంతిని పక్కకు నెట్టాడని స్పష్టంగా అర్ధమవుతుంది. దీంతో సిరాజ్ కు కోపం రావడంతో ఆసీస్ బ్యాటర్ తో కాసేపు ఘర్షణ జరిగింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో తన కోపానికి కారణమైన లబుషేన్ వికెట్ తీసుకొని సిరాజ్ అతనికి కౌంటర్ ఎటాక్ ఇచ్చాడు. 52 బంతుల్లో రెండు పరుగులు మాత్రమే చేసిన లబుషేన్ సిరాజ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
ALSO READ | IND vs AUS: ఆసీస్ ఆటగాళ్లు అద్భుతం.. చేజారిన క్యాచ్‌ను పట్టేశారు
ఈ మ్యాచ్ విషయానికి వస్తే బుమ్రా నిప్పులు చేరగడంతో పాటు సిరాజ్,హర్షిత్ రానా రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 83 పరుగులు వెనకబడి ఉంది. క్రీజ్ లో క్యారీ (19), స్టార్క్ (6) ఉన్నారు. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో తీవ్రంగా నిరాశపరిచింది. ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ ధాటికి తలవంచుతూ కేవలం 150 పరుగులకే ఆలౌటయ్యారు.
Things are heating up! Siraj and Labuschagne exchange a few words.#INDvsAUS pic.twitter.com/leKRuZi7Hi
— 彡Viя͢ʊs ᴛᴊ ᴘᴇᴛᴇʀ र (@TjPeter2599) November 22, 2024