హెడ్‌‌‌‌‌‌‌‌ చెప్పింది అబద్ధం: సిరాజ్‌‌‌‌‌‌‌‌

హెడ్‌‌‌‌‌‌‌‌ చెప్పింది అబద్ధం: సిరాజ్‌‌‌‌‌‌‌‌

అడిలైడ్‌‌‌‌‌‌‌‌:  పింక్ బాల్‌‌‌‌‌‌‌‌ టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్‌‌‌‌‌‌‌‌ను ఔట్ చేసిన తర్వాత అతిగా ప్రవర్తించి విమర్శలు ఎదుర్కొంటున్న  టీమిండియా బౌలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహ్మద్ సిరాజ్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. వికెట్ తీసి సెలబ్రేట్ చేసుకుంటున్న తనను హెడ్‌‌‌‌‌‌‌‌ తిట్టాడనని, అందుకే తాను ఆ విధంగా స్పందించానని అన్నాడు. 

బాగా బౌలింగ్ చేశావంటూ మెచ్చుకుంటే దాన్ని తాను తప్పుగా అర్ధం చేసుకున్నానని హెడ్‌‌‌‌‌‌‌‌ అబద్ధం చెప్పాడని తెలిపాడు. ‘హెడ్‌‌‌‌‌‌‌‌కు బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చేయడాన్ని నేను ఆస్వాదించాను. తను బాగా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేశాడు. కానీ, మన బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో ఎవరైనా సిక్స్‌‌‌‌‌‌‌‌ కొడితే సహజంగానే  చికాకు వస్తుంది.  తర్వాతి బాల్‌‌‌‌‌‌‌‌కే హెడ్‌‌‌‌‌‌‌‌ను  ఔట్‌‌‌‌‌‌‌‌ చేయగానే  నేను సెలబ్రేషన్స్‌‌‌‌‌‌‌‌ చేసుకుంటున్నా. కానీ, అతను నన్ను తిట్టాడు. తను నాతో ‘‘బాగా బౌలింగ్ చేశావు’’ అని అన్నాడన్నది అసత్యం. తను ఏం మాట్లాడాడో టీవీలో చూడొచ్చు’ అని చెప్పాడు.