ముంబై : దులీప్ ట్రోఫీ కోసం ప్రకటించిన జట్లలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. అనారోగ్య కారణాలతో హైదరాబాద్ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను.. ఇండియా–బి టీమ్ నుంచి తప్పించారు. అతని ప్లేస్‌లో నవ్‌దీప్ సైనీని తీసుకున్నారు. ఇండియా–సి టీమ్‌కు ప్రాతినిధ్యం వహించాల్సిన పేసర్ ఉమ్రాన్ మాలిక్ కూడా అనారోగ్యంతో బరిలోకి దిగడం లేదు. అతని ప్లేస్‌లో గౌరవ్ యాదవ్ జట్టులోకి వచ్చాడు.
ఇక ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా విశ్రాంతిని బోర్డు మరికొన్ని రోజులు పొడిగించింది. దీంతో అతన్ని ఇండియా–బి టీమ్ నుంచి తక్షణమే రిలీజ్ చేశారు. జూన్‌లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన జడ్డూ అప్పట్నించి ఆటకు దూరంగా ఉంటున్నాడు. సెప్టెంబర్ 5 నుంచి 8 వరకు తొలి రౌండ్ మ్యాచ్‌లు జరగనున్నాయి.