IND vs ENG 3rd Test: సిరాజ్, జడేజా విజృంభణ.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు భారీ ఆధిక్యం

IND vs ENG 3rd Test: సిరాజ్, జడేజా విజృంభణ.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు భారీ ఆధిక్యం

రాజ్ కోట్ టెస్టులో భారత  బౌలర్లు చెలరేగారు. రెండో రోజు  బౌలింగ్ లో తడబడినా.. మూడో రోజు మన బౌలర్లు ఇంగ్లాండ్ ఆటగాళ్ల భరతం పట్టారు. 2 వికెట్లకు 207 పరుగులతో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్.. తొలి ఇన్నింగ్స్ లో 319 పరుగులకు ఆలౌటైంది. సిరాజ్, కుల్దీప్ యాదవ్, జడేజా ధాటికి చివరి 8 వికెట్లను 95 పరుగులకే చేజార్చుకుంది. లంచ్ వరకు పర్వాలేదనిపించిన ఇంగ్లీష్ జట్టు.. ఆ తర్వాత సిరాజ్ విజ్రంభనతో తమ చివరి 5 వికెట్లను కేవలం 20 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది.

 దీంతో భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో 126 పరుగుల విలువైన భాగస్వామ్యం లభించింది. 5 వికెట్లకు 290 పరుగుల వద్ద లంచ్ కు వెళ్లిన ఇంగ్లాండ్ ను సిరాజ్, జడేజా దెబ్బ తీశారు. జడేజా బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయతించి బుమ్రాకు బౌండరీ దగ్గర క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత సిరాజ్ వరసపెట్టి ఇంగ్లాండ్ లోయర్ ఆర్డర్ ను దెబ్బ తీశాడు. వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ (9), రెహాన్ అహ్మద్ (4), ఆండర్సన్ వికెట్లను తీసి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ను ముగించాడు. 

ఓపెనర్ బెన్ డకెట్ 153 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలవగా.. మిగిలినవారు విఫలమయ్యారు. స్టోక్స్(39), పోప్(41) రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్ నాలుగు వికెట్ల పడగొట్టాడు. జడేజా, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నారు. బుమ్రా, అశ్విన్ చెరో వికెట్ తీసుకున్నారు.