సిరాల గ్రామం జలదిగ్బంధం.. సాయం కోసం ఆర్తనాదాలు

నిర్మల్​ జిల్లాలో వర్షం సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. వాగులు వంకలు పొంగడంతో పాటు పలు గ్రామాలను ముంచెత్తాయి. దీంతో చాలా మంది నిరాశ్రయులయ్యారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో సిరాల గ్రామం జలదిగ్బంధం అయింది. 

గ్రామస్థులు గత్యంతరం లేని పరిస్థితిల్లో జులై 27 రాత్రంతా మహాదేవిని గుట్టపై తలదాచుకున్నారు. విలేజ్లో ఉన్న సుమారు 150 కుటుంబాలదీ ఇదే పరిస్థితి. నిన్న సాయంత్రం చెరువుకు గండి పడటంతో పంటలు కొట్టుకుపోయాయి. 

AsloRead:షెడ్యూల్డ్ తెగల జాబితాలోకి 12 సంఘాలు.. 72వేల మందికి పైగా ప్రయోజనం

గ్రామానికి వెళ్లే రోడ్డు కోతకు గురైంది. ఇళ్లపై కరెంట్​పోల్స్​ విరిగిపడ్డాయి. మంచి నీరు లేక పబ్లిక్​ పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. దాదాపు రెండు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి మంచి నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. 

హెల్త్​ సిబ్బంది సిరాల గ్రామంలో హెల్త్​క్యాంపులు ఏర్పాటు చేశారు. అధికారులు సర్వస్వం కోల్పోయిన తమని ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.