బోయినిపల్లి, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్ గ్రామానికి చల్ల శ్రీనివాస్ (52) దుబాయ్‌లో చనిపోయాడు. శ్రీనివాస్ 12 ఏండ్ల కింద ఉపాధి కోసం దుబాయ్‌కి వెళ్లి అక్కడే దొరికిన పని చేస్తున్నాడు. సోమవారం గుండెపోటు రావడంతో రూమ్‌లోనే చనిపోయాడు.
ఈ విషయాన్ని అదే గ్రామానికి చెందిన, శ్రీనివాస్ బంధువు మంగళవారం కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతుడికి భార్య పద్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దుబాయ్‌లో ఉన్న బంధువు సాయంతో శ్రీనివాస్ డెడ్‌బాడీని గ్రామానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మూడు, నాలుగు రోజుల్లో డెడ్‌బాడీ గ్రామానికి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.