వీడు మాములోడు కాదు.. ఇంటి ఆవరణలో గంజాయి సాగు

డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ  కొందరు గంజాయి సాగుదారులు  కొత్త దారులు  వెతుకుతున్నారు.  కొందరు సీక్రెట్ గా సాగు చేస్తుంటే కొందరు ఏకంగా ఇంట్లోనే సాగు చేస్తున్నారు.  సిరిసిల్లలో  ఓ ప్రభుద్ధుడు   ఇంటి వెనకాల  పూల మొక్కల తరహాలో గంజాయి మొక్కలను పెంచేశాడు.   మొక్కలు ఏపుగా పెరగడంతో ఆ వీధిలో అదోరకమైన వాసన గుప్పుమంది. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక అంతే అయ్యగారి బండారం బయటపడింది.

ALSO READ : అక్కడ ఎలా పట్టాయిరా..ఇవి బంగారం గోలీలంట

రాజన్నసిరిసిల్ల జిల్లా తుంగళ్లపల్లి మండల కేంద్రం ఇందిరా నగర్ కాలనీలోమహమ్మద్ ఐదర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు.  అతడి నుంచి   34  గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు . మహమ్మద్  ఐదర్ ను అరెస్ట్ చేశారు. హైదర్ గంజాయి సాగు చేయడమే కాకుండా యువకులకు అమ్మేవాడని పోలీసులు తెలిపారు.  ఒక్కొక్కటి ఆరు అడుగుల ఎత్తు, నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ పదార్ధాల చట్టం (NDPS) కింద నిందితులపై కేసు నమోదు చేశారు.