సిరిసిల్ల పవర్ లూమ్​కు చీరల తయారీ ఆర్డర్ : విప్ ఆది శ్రీనివాస్

సిరిసిల్ల పవర్ లూమ్​కు చీరల తయారీ ఆర్డర్ : విప్ ఆది శ్రీనివాస్
  • నేతన్నలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం రేవంత్​: విప్ ఆది శ్రీనివాస్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నేతన్నలకు ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారని విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం రెండు చీరలను ఇవ్వబోతున్నదని.. ఆ చీరల తయారీ ఆర్డర్ ను సిరిసిల్ల పవర్ లూంకు ప్రభుత్వం అప్పగించిందని చెప్పారు. మంగళవారం ఆయన సీఎల్పీలో మీడియాతో మాట్లాడారు. మొదటి విడతలో 4.6 కోట్ల మీటర్ల చీరల తయారీకి ఆర్డర్ ఇచ్చిందని తెలిపారు.

గత ప్రభుత్వం మాత్రం కమీషన్లకు కక్కుర్తిపడి బతుకమ్మ చీరలను సూరత్ నుంచి తీసుకొచ్చిందన్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో కేటీఆర్ కూడా ఒప్పుకున్నారని ఆది శ్రీనివాస్ గుర్తుచేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు తమ ప్రభుత్వం నాణ్యమైన చీరలను ఇవ్వబోతోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఆర్డర్లను కేవలం టెస్కోకు మాత్రమే ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిందన్నారు. కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యేగా పదేండ్లు ఉండి, మంత్రిగా పనిచేసి కూడా ఈ ప్రాంతానికి నూలు డిపో తేలేకపోయాడని, ఆయన వల్ల ఇక్కడి నేత కార్మికుల జీవితాల్లో ఎలాంటి మార్పులు  రాలేదని ఆది శ్రీనివాస్ ​చెప్పారు.