సిరిసిల్ల ‘సెస్’ కొత్త డైరెక్టర్లు వీరే

రాజన్న సిరిసిల్ల జిల్లా : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) డైరెక్టర్ల ఎన్నిక పూర్తయింది.  కొత్తగా ఎన్నికైన 15 మంది  డైరెక్టర్ల వివరాలతో కూడిన జాబితాను విడుదల చేశారు.   సిరిసిల్ల టౌన్ -1  డైరెక్టర్ గా  దిడ్డి రమాదేవి (BRS),  సిరిసిల్ల టౌన్ -2 డైరెక్టర్ గా లక్ష్మీనారాయణ (BRS) ఎన్నికయ్యారు.  

తంగళ్ళపల్లి   డైరెక్టర్ గా   చిక్కాల రామారావు ( BRS),  ముస్తాబాద్  డైరెక్టర్ గా సందుపట్ల అంజిరెడ్డి ( BRS),   ఎల్లారెడ్డిపేట   డైరెక్టర్ గా  వరుస  కృష్ణ హరి(BRS),  గంభీరావుపేట డైరెక్టర్ గా  గౌరనేని నారాయణరావు  (BRS),  వీర్నపల్లి డైరెక్టర్ గా   మాడుగుల మల్లేశం (BRS),  వేములవాడ అర్బన్  డైరెక్టర్ గా రేగులపాటి హరి చరణ్ రావు,  వేములవాడ టౌన్ డైరెక్టర్ గా నామాల ఉమా,  కోనరావుపేట  డైరెక్టర్ గా దేవరకొండ తిరపతి (BRS),   రుద్రంగి డైరెక్టర్ గా ఆకుల గంగారం (BRS), ఇల్లంతకుంట డైరెక్టర్ గా మల్లుగారి రవీందర్ రెడ్డి(BRS),  బోయిన్పల్లి డైరెక్టర్ గా కొట్టేపల్లి సుధాకర్ (BRS) ఎన్నికయ్యారు.

చందుర్తిలో బీఆర్ఎస్ విజయం 

చందుర్తి సెస్ ఎన్నిక ఉత్కంఠకు తెర పడింది.బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాసరావు విజయం సాధించినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. శ్రీనివాసరావు, అల్లాడి రమేష్ మధ్య హోరాహోరీగా పోరు సాగింది. బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాసరావు గెలుపుతో కారు పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. 

ఇన్ వాలిడ్ ఓట్లను అధికార పార్టీ కి వాలిడ్ ఓట్లుగా మార్చారు

ఓడి పోయిన బీజేపీ అభ్యర్థి లోపల ఉండగానే బిఅర్ ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచి నట్టు ఎన్నికల అధికారిని మమత వెల్లడించారని వేములవాడ రూరల్ కమలం పార్టీ అభ్యర్థి జక్కుల తిరుపతి ఆరోపించారు. కౌంటింగ్ కేంద్రం లోపల కరెంట్ తీసివేసి తనను నిర్బందించారని చెప్పారు.  ఇన్ వాలిడ్ ఓట్లను అధికార పార్టీ కి వాలిడ్ ఓట్లుగా మార్చారని మండిపడ్డారు.  మంత్రి కెటిఆర్ కనుసైగల్లో ఇదంతా జరిగిందని తెలిపారు. వేములవాడ రూరల్ డైరెక్టర్ స్థానానికి నిర్వహించిన రీ కౌంటింగ్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని చెప్పారు. రిజల్ట్స్ 4 గంటల కు పూర్తి అయితే రాత్రి 11 గంటలకు ప్రకటించడం దారుణమన్నారు.