చెరువును పూడ్చి కట్టారు..
నాలా నిర్మాణం మరిచారు
రూ.100 కోట్లతో చేపట్టినా ప్లానింగ్ లోపం
ఒక్క గట్టి వానకే నీళ్లలో మునిగిన బిల్డింగ్
రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో చేపట్టిన కొత్త కలెక్టరేట్ నీళ్లలో మునిగింది. రూ.100 కోట్ల ఖర్చుతో, అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్న ఈ బిల్డింగ్.. ఒక్క గట్టివానకే పూర్తిగా జలమయం అయిపోయింది. కలెకరేట్్ట కోసం చెరువును పూడ్చి పెద్ద బిల్డిం గ్కట్టిన ఆఫీసర్లు.. నాలా నిర్మాణం మాత్రం మర్చిపోయారు. అసలు చెరువును పూడ్చడమే గాక.. ఇన్నాళ్లుగా చెరువులోకి వచ్చిన వరద నీళ్లు ఇప్పుడు ఎక్కడికి పోతాయో, ఎటు మళ్లించాలనేది మాత్రం పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతానికి తాత్కాలికంగా ఓ కాల్వ తీసి వరద నీళను మ్లళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు.
అంత ఖర్చుతో కట్టినా..
సిరిసిల్లలోని బైపాస్ రోడ్డును ఆనుకుని ఉన్న దామెరకుంటను పూడ్చి సూమారు 35 ఎకరాల్లో రూ. 100 కోట్ల ఖర్చుతో కలెక్టరేట్ బిల్డింగ్ నిర్మాణం చేపట్టారు. పనులు చివరి దశకు వచ్చాయి. మరో నెల రోజుల్లో ప్రారంభించే అవకాశం కూడా ఉంది. అత్యాధునిక వసతులు, విశాలమైన గదులు, అధికారులకు క్వార్టర్స్ తో పాటు పార్క్ లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ బిల్డింగ్ నడుస్తున్న స్థలం ఇంతకుముందు చెరువు. సిరిసిల్లలోని డ్రెయిన్ వాటర్ తో పాటు చంద్రంపేట, చిన్నబోనాల, ముష్టిపల్లి చెరువులు నిండితే ఆ వర్షపు నీళ్లు దామెరకుంటలోకి వస్తాయి. ఇప్పుడూ అలా నీళ్లు ఆ ప్రాంతానికి వచ్చాయి. కానీ చెరువును పూడ్చిన ఆఫీసర్లు.. నీళ్లు మళ్లించేందుకు కాల్వలు నిర్మించలేదు. బిల్డింగ్ కట్టడానికి ముందే కనీసం ఆరు నుంచి ఎనిమిది మీటర్ల వెడల్పుతో 800 మీటర్ల పొడవున నాలా నిర్మించాల్సి ఉంది. ఇప్పటికీ మొదలు పెట్టలేదు. దామెరకుంటపైనున్నచెరువులకు గండిగానీ పడితే కొత్త కలెక్టరేట్ పూర్తిగా ముంపునకు గురవడం ఖాయమని స్థానికులు చెప్తున్నారు. కాగా ఈ విషయంపై వివరణ కోరగా.. తాను సిరిసిల్లలో తాత్కాలిక డ్యూటీలో ఉన్నానని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల ఆర్అండ్ బీ ఈఈ శ్రీనివాస్ రాజు చెప్పారు. ఇక వరద వస్తే కలెక్టరేట్ చుట్టూ వరద నీళ్లు చేరుకుంటాయన్నది వాస్తవమేనని, ప్రస్తుతం మట్టికాల్వ తీశామని కలెక్టరేట్ నిర్మాణ ఇన్చార్జి గురువారెడ్డి చెప్పారు. పర్మెనెంట్ నాలా నిర్మిస్తే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు.
For More News..