ఎక్సైజ్ ఆఫీసర్ల సస్పెన్షన్.. సిరిసిల్ల సూపరింటెండెంట్​తో పాటు ఇన్​స్పెక్టర్ పై వేటు

ఎక్సైజ్ ఆఫీసర్ల సస్పెన్షన్.. సిరిసిల్ల సూపరింటెండెంట్​తో పాటు ఇన్​స్పెక్టర్ పై వేటు

రాజన్న సిరిసిల్ల, వెలుగు: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఎక్సైజ్  ఆఫీసర్లను ప్రభుత్వం సస్పెండ్​ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల ఎక్సైజ్ సూపరింటెండెంట్​ పంచాక్షరి, ఇన్స్​పెక్టర్  గులాం ముస్తఫాను సస్పెండ్  చేశారు. పట్టణంలోని చిత్ర  బార్​ అండ్  రెస్టారెంట్ కు నిబంధనలకు విరుద్ధంగా ట్రేడ్  లైసెన్స్  లేకుండానే 2బి లైసెన్స్  రెన్యువల్  చేసి క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించారు. 

చిత్ర బార్  విషయంలో తప్పుడు వివరాలను సమర్పించి లైసెన్స్  రెన్యూవల్  చేశారని గుర్తించారు. ఇద్దరు అధికారులు రూల్స్​కు విరుద్ధంగా వ్యవహరించారని తేలడంతో వేటు వేశారు. ఇదిలాఉంటే ట్రేడ్  లైసెన్స్  లేదనే కారణంతో రెండు నెలల కింద చిత్రబార్ ను మూసివేశారు.