మల్టీ లెవల్ బిజినెస్​ పేరుతో మోసం.. అడ్డంగా దొరికిన వైనం

తెలుగు రాష్ట్రాల్లో మల్టీ లెవల్​ బిజినెస్​ పేరుతో మోసానికి పాల్పడిన వ్యక్తిని రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు జులై 30 న అరెస్టు చేశారు. అతన్ని మీడియా ముందు హాజరుపరిచి కేసు సంబంధించిన వివరాలను ఎస్పీ అఖిల్​మహాజన్, డీఎస్పీ ఉదయ్​రెడ్డి, సీఐ సదన్​కుమార్​లు వెల్లడించారు. 

వారు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లాకు చెందిన రమేశ్​చారి అనే వ్యక్తి మల్టీ లెవల్​ బిజినెస్​పేరుతో తెలంగాణ వ్యాప్తంగా రూ.9 కోట్ల మేర మోసపూరిత లావాదేవీలు జరిపాడు. ఇందులో ఒక్క సిరిసిల్ల జిల్లాలోనే రూ.4 కోట్ల ఆన్లైన్​ బిజినెస్​ చేశాడు. 

హైదరాబాద్​లో తెలంగాణ ఫుడ్​ అండ్​ ఎలక్ట్రానిక్స్​ కంపెనీ పేరుతో ఫేక్ ఆఫీస్​ని ఏర్పాటు చేశాడు. అనంతరం అన్ని వర్గాల ప్రజలే టార్గెట్ గా ఈ దందాకు తెరతీశాడు. ముస్తాబాద్​మండలం అవునూరి గ్రామానికి చంఎదిన అదర్స్​ గౌడ్​ అనే వ్యక్తి అతని చేతిల్లో మోసపోయాడు. 

ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా తాజాగా పట్టుబడ్డాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అతనిపై 19 కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితులు ఎవరైనా ఉంటే జిల్లా పోలీస్​కార్యాలయంలో కంప్లైంట్​ చేయాలని ఎస్పీ సూచించారు.