ఇవాళ సిరిసిల్ల అర్బన్ బ్యాంకు ఎన్నికలు

ఇవాళ సిరిసిల్ల  అర్బన్ బ్యాంకు ఎన్నికలు
  • పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ 
  • పార్టీలకు అతీతంగా ఎన్నికలు
  • ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

రాజన్నసిరిసిల్ల,వెలుగు: సిరిసిల్ల అర్బన్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నేడు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు కో ఆపరేటివ్ అధికారులు  ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్టీలకతీతంగా ఎన్నికలు జరుగుతున్నప్పటికీ, పరోక్షంగా  కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ  ప్యానల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బరిలోకి దిగుతున్నాయి. గురువారం పోలింగ్ ముగిసిన వెంటనే సాయంత్రం ఫలితాలు వెలువడనున్నాయి. 

ఎన్నికల బరిలో 61 మంది 

సిరిసిల్ల అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంకు రూ.100 కోట్ల టర్నోవర్ కలిగి ఉంది. 12 డైరెక్టర్ స్థానాలకు గానూ  61 మంది  బరిలో నిలిచారు. పార్టీల గుర్తులు లేకుండా ఇండిపెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా జరిగే ఎన్నికలైనప్పటికి అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బీఆర్ఎస్ , బీజేపీలు ఇప్పటికే తమ అభ్యర్థులను బరిలోకి దింపి గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. 

ఈసారి బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కష్టమే? 

అధికారంలో ఉన్నప్పుడే బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 2018లో జరిగిన అర్బన్ ఎన్నికల్లో ఎదురీత తప్పలేదు. 12 మంది డైరెక్టర్ స్థానాలకు కేవలం ఆరింటిని గెలిచింది. ఇతర ప్యానల్ నుంచి గెలిచిన డైరెక్టర్ల మద్దతుతో చైర్మన్ పోస్టును దక్కించుకుంది. ప్రస్తుతం బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అధికారం పోవడం, లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లోనూ తేలిపోవడంతో ఆ పార్టీకి కష్టమని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 6177 ఓట్లున్న అర్బన్ బ్యాంక్ ఎన్నికలు జడ్పీటీసీ స్థాయి ఎన్నికలను తలదన్నేలా ఉంటాయి. 

పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి

సిరిసిల్ల అర్బన్ బ్యాంక్  ఎన్నికలకు కో ఆపరేటివ్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఎన్నికకు ఒక్కో డైరెక్టర్ స్థానానికి ఒక్కో బూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేశారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు పోలింగ్ నిర్వహిస్తారు. 3 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు కౌంటింగ్​ ప్రక్రియ ప్రారంభమై ఫలితాలను ప్రకటిస్తారు. ఒక్కో బూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముగ్గురు పోలింగ్ ఆఫీసర్లు ఉంటారని ఎన్నికల అధికారి రామకృష్ణ తెలిపారు. మొత్తం పోలింగ్ ప్రక్రియను నిర్వహించేందుకు 12 మంది పోలింగ్ ఆఫీసర్లు,15 మంది ఏపీవోలు,18 మంది పోలింగ్ అసిస్టెంట్లను నియమించారు. గెలిచిన డైరెక్టర్లతో మరుసటి రోజు చైర్మన్ ఎన్నిక ఉంటుందని డీసీవో బుద్ధనాయుడు ప్రకటించారు.