- నేత కార్మికుల ఓట్లపై మూడు పార్టీలు ఫోకస్
- సిరిసిల్లలో మకాం వేస్తున్న కేటీఆర్
- తరుచూ సిరిసిల్లలో పర్యటిస్తున్న బండి సంజయ్
రాజన్నసిరిసిల్ల,వెలుగు: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో సిరిసిల్ల ఓట్లు కీలకంగా మారునున్నాయి. ఇక్కడ అత్యధిక జనాభా ఉన్న పద్మశాలీల ఓట్లపై మూడు పార్టీలు ఫుల్ పోకస్ పెట్టాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ సిరిసిల్లలోనే మకాం వేస్తున్నారు. ఈనెల 25,26 రెండు రోజులు సిరిసిల్లలో ఉండి కార్యకర్తలతో సమావేశమయ్యారు. మరోవైపు బండి సంజయ్ తరుచూ పర్యటిస్తూ బీజేపీ కార్యకర్తలను కలుస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజక వర్గాలలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించి క్యాడర్ దిశానిర్దేశం చేశారు. అత్యధిక ఓట్లున్న పద్మశాలీ ఓట్లను తమవైపు తిప్పుకోవడానికి ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి.
కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ ఎంపీ బోయిఆన్పల్లి వినోద్ కుమార్ గెలిపించేందుకు కేటీఆర్ సిరిసిల్లలో మకాం వేస్తున్నారు. ఇటీవల సిరిసిల్లలో రెండు రోజలు ఉండి పార్లమెంట్ ఎన్నికల్లో క్యాడర్ అనుసరించిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. సొంత నియోజక వర్గంలో మెజారిటీ సంపాదించేందుకు చమటోడుస్తున్నారు. వారంలో రెండుసార్లు నియోజకవర్గంలో పర్యటిస్తూ శుభకార్యాలకు హాజరువుతున్నారు. ఎల్లమ్మ సిద్దోగం, పెద్దమ్మ సిద్దోగం లాంటి కమ్యూనిటీ పరంగా జరుపుకునే పండగలకు విధిగా హాజరవుతున్నారు.
ఉదయం ,సాయంత్రం కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. తన సొంత నియోజక వర్గమైన సిరిసిల్లలో అత్యధిక ఓట్లు రాబట్టేందుకు యత్నిస్తున్నారు.ఇటీవల ముగ్గురు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే బాధిత కుటుంబాలను పరామర్శించి ఒక్కో కుటుంబానికి రూ. 50వేలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరెల ఆర్డర్ లు ఇవ్వడంలేదని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారానికి రెండు రోజులు సిరిసిల్లలోనే ఉంటానని గత అసెంబ్లీ ఎన్నికల్లో హామి ఇచ్చిన ఎలక్షన్ టైంలో ఉంటూ తన హామీని కేటీఆర్ నిలబెట్టుకుంటున్నారని చర్చ నడుస్తోంది.మరోవైను కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్ పల్లి వినోద్ కుమార్ నిత్యం సిరిసిల్లలో పర్యటిస్తున్నారు.
బండి సంజయ్ పర్యటనలు
సిరిసిల్ల,వేములవాడ రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో బండి సంజయ్ తరుచూ పర్యటిస్తున్నారు. ఈనెల 25న సిరిసిల్ల పట్టణంలో బండి సంజయ్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఓకే రోజు పది మంది కార్యకర్తల శుభకార్యాలకు హాజరయ్యారు. ఇటీవల మరణించిన ఇద్దరి నేత కార్మిక కుటుంబాలను పరామర్శించి రూ. 50వేలు అందజేశారు. సిరిసిల్ల నేతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం బకాయిలను విడుదల చేసి ఆర్డర్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొత్తం మీద సిరిసిల్ల పద్మశాలీ ఓట్లను ఆకర్షించేందుకు నేతలు నేతన్నల చుట్టు తిరుగుతున్నారన్నా చర్చ నడుస్తోంది. నేతన్నలు ఏ నేత తలరాత మార్చుతారో చూడాలి మరి.
నేత కార్మికులకు కాంగ్రెస్ హామీ
నేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వ ఆర్డర్ లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీఇచ్చింది.గత ప్రభుత్వం రిలీజ్ చేయకుండా ఆపిన బతుకమ్మ చీరెల బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం టెస్కోకు వారం రోజుల కిందట రూ. 50 కోట్లు విడుదల చేసింది.ఆర్డర్ లు ఇవ్వాలంటూ దీక్షలు చేస్తున్న నేత కార్మిక సంఘాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలు జరిపి దీక్షలను వివమింపజేశారు. సెప్టెంబర్ లోగా మిగితా బకాయిలను విడుదల చేస్తామని మంత్రి హామి ఇచ్చారు. దీంతో నేతన్నలు దీక్షలు విరమించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గత మాసం ఆర్వీఎం కు సంబంధించి 65లక్షల మీటర్లు బట్ట ఉత్పత్తి ఆర్డర్ లు ఇచ్చింది.