ప్రజల ఆశీస్సులతో మరోసారి గెలుస్తాను : కోనేరు కోనప్ప

దహెగాం,వెలుగు:  ప్రజల ఆశీస్సులతో మరోసారి గెలుస్తానని సిర్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. శుక్రవారం  దహెగాం మండలకేంద్రంతో పాటు  మొట్లాగూడా, రావులపల్లి, దిగిడ గిరవెల్లి, ఖర్జి, గెర్రె, చిన్నరాస్పల్లి, చంద్రపల్లి, కొంచవెల్లి, ఒడ్డుగూడ  గ్రామాల్లో  ప్రచారం నిర్వహించారు. ఆయనకు గ్రామాల్లో ఘన స్వాగతం లభించింది.

ఈ సందర్భంగా  మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులతో  మూడుసార్లు అసెంబ్లీలో అడుగు పెట్టానని, తుది శ్వాస వరకు సేవ చేస్తానని పేర్కొన్నారు.  రాజకీయాలు, ఎన్నికలు ముఖ్యం కాదని, ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడమే తన లక్ష్యమన్నారు. నియోజకవర్గంలోని ప్రతి పల్లెతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు.  ఎన్నికలలో లబ్ది కోసం పరాయి ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కారు గుర్తుకు ఓటు  వేసి తనను గెలిపించాలని కోరారు.