అంబేద్కర్​ను అవమానించిన చరిత్ర కాంగ్రెస్ ది : ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు

అంబేద్కర్​ను అవమానించిన చరిత్ర కాంగ్రెస్ ది : ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు

నస్పూర్, వెలుగు: అంబేద్కర్​ను అడుగడుగునా అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు అన్నారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం బీజేపీ నేత వెరబెల్లి రఘునాథ్ ఆధ్వర్యంలో నస్పూర్ పట్టణంలో సీసీసీ కార్నర్ వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హరీశ్ బాబు మాట్లాడుతూ.. అంబేద్కర్​ను కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అవమానించిందని, ఆయన అంత్యక్రియలు ఢిల్లీలో జరగనివ్వకుండా పార్థివదేహాన్ని ముంబైకి తరలించి విమాన ఛార్జీలు చెల్లించాలని ఆయన సతీమణికి బిల్లు పంపిన చరిత్ర కాంగ్రెస్​ది అని విమర్శించారు.

శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనా విధానాన్ని బలపరిచిన అంబేద్కర్​కు, ఆయన ఆలోచనలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం గౌరవమిస్తోందని పేర్కొన్నారు. అణగారిన వర్గాల్లో వెలుగులు నింపిన అంబేద్కర్​కు భారతరత్న ఇచ్చేందుకు బీజేపీ కృషి చేసిందన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా 12 మంది దళితులు, 27 మంది ఓబీసీలకు, 8 మంది మహిళలకు మోదీ ప్రభుత్వం తమ కేబినెట్​లో చోటు కల్పించిందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, దుర్గం అశోక్, కొయ్యల ఎమాజీ, పెద్దపల్లి పురుషోత్తం, అమరరాజుల శ్రీదేవి, కోడి రమేశ్, గాజుల ముఖేష్ గౌడ్, బియ్యాల సతీశ్​ రావు, మున్నరాజ సిసోడియా, బత్తుల సమ్మయ్య, సత్రం రమేశ్​ తదితరులు పాల్గొన్నారు.

జయంతిని ఘనంగా నిర్వహించాలి

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: ​అంబేడ్కర్ ​జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఎంపీ గొడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్​శంకర్ ​అన్నారు. ఆదిలాబాద్​పట్టణంలోని అంబేద్కర్​ విగ్రహాన్ని ఆదివారం పాలతో శుద్ధి చేశారు. కాంగ్రెస్ ​పార్టీ అంబేడ్కర్​ను ఎన్నో రకాలుగా అవమానించించిందని.. కానీ బీజేపీ ప్రభుత్వం ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించిందని పేర్కొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందం, నాయకులు ఆకుల ప్రవీణ్, సుభాష్, లాలా మున్నా, జోగు రవి, వేద వ్యాస్, రాజేశ్, సతీశ్, ముకుందరావు తదితరులు పాల్గొన్నారు.