ఢిల్లీ తెలంగాణ భవన్ మాఫియాలా మారింది : ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌

ఢిల్లీ తెలంగాణ భవన్ మాఫియాలా మారింది : ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌
  • అర్ధరాత్రి నాకు రూమ్‌‌ ఇవ్వకుండా వెనక్కి పంపారు 

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలోని తెలంగాణ భవన్ మాఫియాలా మారిందని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి‌‌ హరీశ్‌‌ మండిపడ్డారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఢిల్లీ పర్యటనకు వచ్చిన తనకు.. మంగళవారం అర్ధరాత్రి భవన్ సిబ్బంది రూమ్ ఇవ్వకుండా వెనక్కి పంపారన్నారు. ఈ అంశంపై భవన్ రెసిడెంట్ కమిషనర్‌‌‌‌కు ఫిర్యాదు చేశానని వెల్లడించారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ సెషన్‌‌లో ఈ ఘటనకు ఆర్సీని బాధ్యుడిగా పేర్కొంటూ ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. 

దీనిపై స్పీకర్, సీఎం, ఆర్ అండ్ బీ మంత్రి స్పందించి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి రూమ్స్‌‌ కేటాయింపుల్లో ఢిల్లీ తెలంగాణ భవన్ మాఫియాలా తయారైందని ఆయన ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేలు అంటే తెలంగాణ భవన్ సిబ్బందికి కనీస గౌరవం లేదన్నారు‌‌. దివాలా కోరుతనానికి తెలంగాణ భవన్ ఒక ఉదాహరణ అని ఆరోపించారు.