కాగజ్ నగర్: పోస్టల్ అర్డీ పాలసీ డబ్బులు కాజేశారని ఆరోపిస్తూ చింతలమానేపల్లి మండలంలోని బాలాజీ అనుకోడ గ్రామనికి చెందిన వృద్ధులు, మహిళలు శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సిర్పూర్ సబ్ పోస్ట్ మాస్టర్ శ్రీనివాస్ తమ ఆర్డీ పాలసీ డబ్బులు కాజేశారని ఆరోపించారు.
గ్రామంలోని సుమారు 200 మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పోస్ట్ మాస్టర్ వద్ద ప్రతి నెలా తమ పింఛన్ డబ్బులు, కూలీ డబ్బులను ఆర్డీ పాలసీ కింద రూ.500, 200 చొప్పున ఐదేండ్ల వరకు కట్టినట్లు తెలిపారు. అయితే, పాలసీ కాలపరిమితి మించిపోయి రెండేండ్లైనా ఆ డబ్బులను సబ్ పోస్ట్ మాస్టర్ తమకు చెల్లించడం లేదన్నారు. వెంటనే తమ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు.