బీఆర్ఎస్ కు సిర్పూర్ (టి) జడ్పీటీసీ రాజీనామా

కాగజ్ నగర్, వెలుగు:   బీఆర్ఎస్ పార్టీకి సిర్పూర్ (టి) జడ్పీటీసీ రాజీనామా చేశారు. శుక్రవారం రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలోనే జడ్పీటీసీ నీరటి రేఖ బీ ఆర్ ఎస్ పార్టీకి రిజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు.  ఈ మేరకు సిర్పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం సమయం నుంచి పార్టీ లో ఉన్న తనకు స్థానిక ఎమ్మెల్యే కోనప్ప విలువ ఇవ్వకుండా ఇతరులకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. 

అభివృద్ధి పరంగా సహకారం ఇవ్వడం లేదని ఆరోపించారు.ఈ కారణంగానే తాను రాజీనామా చేస్తున్నట్లు  చెప్పారు. ఆమెతో పాటు భర్త   జిల్లా గ్రంథాలయ కమిటీ డైరెక్టర్ నీరటి సత్యనారాయణ కూడా రాజీనామా చేశారు.