రిమ్స్​ కార్మికులకు వేతనాలు  ఇవ్వాలి : సిర్ర దేవేందర్

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు:  రిమ్స్​లో పని చేస్తున్న శానిటేషన్​, సెక్యూరిటీ, పేషెంట్​ కేర్​ కార్మికుల వేతనాలను  ​ వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ రాష్ర్ట కార్యదర్శి సిర్ర దేవేందర్​ డిమాండ్​ చేశారు.  ఏఐటీయూసీ కార్యాలయంలో గురువారం ఆ యూనియన్​ అనుబంధం తెలంగాణ మెడికల్​ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్​డీ ముజీప్ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

 కాంట్రాక్టర్ స్పందించి ఈ నెల 17  లోపు  వేతనాలు పీఎఫ్​, ఈఎస్​ఐ కార్మికులకు ఇవ్వాలన్నారు. లేకుంటే  18  నుంచి  ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా  అధ్యక్షుడు డోంగ్రే చందు,జి. సంగీత, ఖాసీం, కార్మికులు రాము, శిల్ప గంగు, సునీత, తదితరులు పాల్గొన్నారు