
శ్రీవిష్ణు హీరోగా కార్తీక్ రాజు రూపొందిస్తున్న చిత్రం ‘సింగిల్’. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్స్. వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. గురువారం ఈ చిత్రం నుంచి ఫ్రస్ట్రేషన్ యాంథమ్ పేరుతో రెండో పాటను విడుదల చేశారు.
విశాల్ చంద్రశేఖర్ కంపోజ్ చేసిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి క్యాచీ లిరిక్స్ రాయగా, రాహుల్ సిప్లిగంజ్ ఎనర్జిటిక్‌గా పాడాడు. ‘జానీ జానీ ఎస్ పప్పా.. జగమంతా జంటలేగా నేను తప్పా.. ప్రేమించడమే పెద్ద తప్పా.. ఏంది నాకీ కర్మని, రమ్మనంటే పొమ్మని.. సిరాకైంది సింగిల్ బతుకు.. ఇక మత్తు గ్లాసు తప్పదు మనకు..’ అంటూ సాగిన ఈ పాటలో ఒంటరి జీవితాన్ని గడుపుతున్న హీరో ఫ్రస్ట్రేషన్‌ను చూపించారు.
శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్‌తో కలిసి ఒంటరితనంకి హ్యుమర్‌ను జోడిస్తూ చెప్పడం హిలేరియస్‌గా ఉంది. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. మే 9న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది.