బీజేపీ దుర్మార్గాలకు పరాకాష్ట సిసోడియా అరెస్ట్ : జగదీష్ రెడ్డి

బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు అప్రజాస్వామికమని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ దుర్మార్గాలకు పరాకాష్ట ఆప్ నేత సిసోడియా అరెస్ట్ అని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు చేసిన ఆరోపణలపై మాత్రమే కేంద్ర నిఘా సంస్థలు పని చేస్తున్నాయని మంత్రి ఆరోపించారు. ఎమర్జెన్సీకి మించిన దారుణమైన పరిస్థితులు దేశంలో కొనసాగుతున్నాయన్న ఆయన.. అణచివేతలతో చరిత్రలో ఏ ప్రభుత్వమూ మనుగడ సాధించలేదని స్పష్టం చేశారు. అంతకుముదు సూర్యాపేట మండలం రామచంద్రాపురం గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ట, సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు.